Breaking News

శోభన్ బాబు ఎదుగుదల సీనియర్ ఎన్టీఆర్ కి సంబంధం ఏంటి ?

శోభన్ బాబు.. తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత అందగాడిగా గుర్తింపు పొందిన నటుడు. 1959లో ఎన్టీఆర్ నటించిన దైవబలం సినిమా ద్వారా తను నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అందులో ఆయన ఓ పాత్ర చేశాడు. కాసేపు ఈ సినిమాలో కనిపిస్తాడు. కేవలం మూడు రోజుల్లో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమా తర్వాత మహామాయ అనే సినిమాలో శోభన్ బాబును హీరోగా పెట్టి సినిమాగా తీయాలి అనుకున్నారు. కానీ తను నటించిన తొలి సినిమా దైవబలం ఫ్లాప్ కావడంతో అంతకు ముందు అనుకున్న ప్రతిపాదన రద్దు అయ్యింది. ఆ తర్వాత 1960లో చిత్రపురి నారాయణమూర్తి దర్శకత్వంలో వచ్చిన భక్త శబరి దగ్గరుండే కరుణ అనే ముని కొడుకుగా శోభన్ బాబు నటించాడు. ఈ సినిమా తనకు మంచి గుర్తింపు తెచ్చింది.

అటు 1960లో ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో సీతారామ క‌ల్యాణం మూవీని ప్రారంభించాడు. అందులో ఎన్టీఆర్ రావణుడి పాత్ర పోషించాడు. రాముడిగా హ‌ర‌నాథ్‌ను ఎంపిక చేసిన‌ట్లు శోభ‌న్‌ బాబుకు తెలిసింది. అయితే ఈ సినిమాలో అవకాశం కోసం తను ఎన్టీఆర్ ను కలిశాడు. అయితే ఏ పాత్ర కావాలి బ్రదర్ అని అడిగాడు ఎన్టీఆర్. అయితే తనకు లక్ష్మణుడి పాత్ర కావాలి అని అడిగాడు. ఎన్టీఆర్ సరే బ్రదర్ అన్నాడు.

అలా 1961 వచ్చిన సీతారామ క‌ల్యాణంలో ల‌క్ష్మ‌ణుడిగా కనిపించాడు శోభన్ బాబు. నిజానికి ఈ సినిమాలో తన పాత్ర చిన్నగానే ఉన్నా.. ఇతరులతో కలిసి ఉన్న సీన్లు ఎక్కువ కావడంతో 56 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నాడు. ఆ సినిమా తర్వాత భీష్మ అనే సినిమాలో పని చేసే ఛాన్స్ ఇచ్చాడు నందమూరి తారకుడు. ఈ సినిమాలో శోభన్ బాబు అర్జునుడి క్యారెక్టర్ చేశాడు. మొత్తంగా కెరీర్ ప్రారంభంలో శోభన్ బాబుకు ఎన్టీఆర్ ఎంతో సపోర్ట్ చేశాడు. ఆ తర్వాత హీరోగా మారి చక్కటి గుర్తింపు తెచ్చుకున్నాడు.

About Mamatha

Check Also

పదో తరగతిలోనే ప్రేమలో పడ్డ ‘సిరి’.. అతన్ని బతికించుకోలేకపోయానంటూ కన్నీళ్లు..

తెలుగు పాపులర్ రియాలిటీ ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ను ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. హౌస్‌లో కంటెస్టెంట్స్ టాస్కులు పూర్తి చేస్తూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *