Breaking News

రాజేంద్ర ప్రసాద్ పై మనసు పారేసుకున్న హీరోయిన్.. కానీ చివరికి – TeluguNews

ఎయిటీస్ లో తెలుగు జనాలను విపరీతంగా అలరించిన జంట రాజేంద్ర ప్రసాద్, రజిని. వీరిద్దరు హీరో, హీరోయిన్లుగా ఎన్నో చక్కటి సినిమాల్లో నటించి హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. 1987లో ఆహా నా పెళ్లంట సినిమాతో మొదలైన వీరి ప్రయాణం ఎన్నో సినిమాలు చేస్తూ ముందుకు సాగింది. ముఖ్యంగా జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన ఆహా నా పెళ్లంట సినిమాలో వీరిద్దరు చేసిన అల్లరి మామూలగా ఉండదు. జనాలకు కావాల్సినంత వినోదాన్ని పంచారు. ఈ సినిమా తర్వాత ఇద్దరు కలిసి పలు సినిమాల్లో నటించి మెప్పించారు.

భ‌లే మొగుడు, గుండ‌మ్మ‌గారి కృష్ణులు, భామా క‌లాపం, జీవ‌నగంగ‌, చిక్క‌డు దొర‌క‌డు, బంధువులొస్తున్నారు జాగ్ర‌త్త‌, చ‌లాకీ మొగుడు చాద‌స్త‌పు పెళ్లాం, గ‌డుగ్గాయి సహా పలు సినిమాలు చేసి జనాలను ఆకట్టుకున్నారు. నిజానికి అప్పట్లో సినిమా షూటింగ్ అంటే ఇప్పటి పద్దతులకు పూర్తిగా విరుద్ధంగా ఉండేది. సెట్స్ మీద హీరో, హీరోయిన్లు కలిసి మాట్లాడుకునేవారు కాదు. షాట్ కాగానే ఎవరి రూంలోకి వారు వెళ్లిపోయేవారు. అయితే మిగతా వారి విషయం పక్కకు పెడితే రజినీతో మాత్రం రాజేంద్ర ప్రసాద్ కాస్త చనువుగానే ఉండేవారు. అందుకే ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని అప్పట్లో ఫుకార్లు షికారు చేశాయి.

చాలా మంది హీరోయిన్లు రాజేంద్ర ప్రసాద్ తో కలిసి నటించం అని చెప్పిన సందర్భాలున్నాయి. ఆ సమయంలో తనతో నటించేందుకు ఓకే చెప్పింది రజిని. అప్పటికే తను టాలీవుడ్ టాప్ హీరోలు అయిన బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేశ్, అర్జున్ సహా పలువురు హీరోలతో సినిమాలు చేసింది. అయితే రాజేంద్ర ప్రసాద్ తో చేయడానికి చాలా మంది హీరోయిన్లు నో చెప్పారు. కానీ తను కూడా ఒకప్పుడు చిన్న నటీమణినే.. అలాంటి నేను చిన్న హీరోతో కలిసి నటించడంలో తప్పేం లేదని చెప్పింది. చెప్పడమే కాదు.. రాజేంద్ర ప్రసాద్ తో కలిసి నటించింది కూడా. అప్పటి నుంచి తనపై రాజేంద్ర ప్రసాద్ కు ప్రత్యేకమైన అభిమానం ఉందని చెప్పింది. అందుకే ఇద్దరం చాలా చనువుగా ఉండేవాళ్లం అని చెప్పింది. తమ మధ్య స్నేహాన్ని చాలా మంది అపార్థం చేసుకున్నారని వెల్లడించింది రజినీ. కానీ తాము ఇప్పటికీ మంచి మిత్రులుగానే కొనసాగుతున్నట్లు చెప్పింది.

About Mamatha

Check Also

పదో తరగతిలోనే ప్రేమలో పడ్డ ‘సిరి’.. అతన్ని బతికించుకోలేకపోయానంటూ కన్నీళ్లు..

తెలుగు పాపులర్ రియాలిటీ ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ను ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. హౌస్‌లో కంటెస్టెంట్స్ టాస్కులు పూర్తి చేస్తూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *