Breaking News

వెండితెరపై వెలుగు వెలిగిన ముమైత్ ఖాన్.. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది ?

తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, బెంగాలి, ఒడియా భాషల్లో పలు చిత్రాల్లో ఐటెం సాంగ్స్‌లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి ముమైత్ ఖాన్. ఇకపోతె తెలుగు తెరపై ఈ భామ ఐటెం సాంగ్స్ మాత్రమే కాదు కీలక పాత్రలను కూడా పలు చిత్రాల్లో పోషించింది. ఐటెం సాంగ్స్‌లో నటించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అభిమానులను కూడా సొంతం చేసుకుంది ముమైత్. ఈ భామతో ఐటెం సాంగ్ చేయిస్తే చాలు.. సినిమా హిట్ గ్యారంటీ అనుకునే వారు మేకర్స్.

సూపర్ స్టార్ మహేశ్ బాబు సూపర్ హిట్ మూవీ ‘పోకిరి’లో ‘ఇప్పటికింక నా వయసు నిండా పదహారే’ సాంగ్ ద్వారా ప్రేక్షకులను ఉర్రూతలూగించింది ముమైత్. ఈ నటి డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమాల్లో ఎక్కువగా ఉంటుంది. విక్టరీ వెంకటేశ్ ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రంలో ‘ఓ బేబీ ఓ బేబీ గురువా’ సాంగ్‌లో ముమైత్ ఖాన్ డ్యాన్స్ చూసి కుర్రకారు ఫిదా అయిపోయింది. ‘ఎవడైతే నాకేంటి, మైసమ్మ ఐపీఎస్, ఆపరేషన్ దుర్యోధన’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన ముమైత్ పలు చిత్రాల్లో గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఇచ్చింది. అయితే, ముమైత్ ఖాన్‌కు కాలక్రమంలో సినీ అవకాశాలు బాగా తగ్గిపోయాయి.

2016 తర్వాత ముమైత్ సినిమాలలో కనిపించింది. అయితే, ముమైత్ బుల్లి తెరపై మాత్రం సందడి చేస్తూనే ఉంది. తాజాగా డ్రగ్స్ కేసు వ్యవహారంలో తెరమీదకు రాగా ఆమె పేరు మళ్లీ వినబడుతున్నది. ఇకపోతే తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ వన్‌లో ముమైత్ ఖాన్ కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసింది. ఈటీవీ వారి ‘సూపర్ 2’, స్టార్ మా వారి ‘సిక్స్త్ సెన్స్’ ప్రోగ్రాంలో ముమైత్ కనిపించింది. స్టార్ మా వారి ‘డ్యాన్స్ ప్లస్ ’ ప్రోగ్రాంకు జడ్జ్‌గా ముమైత్ ఖాన్ వ్యవహరిస్తోంది.

About Mamatha

Check Also

ఎడమచేతి వాటంగల సెలబ్రిటీలు వీళ్ళే..!!

సాధారణంగా చాలా మందికి ఏ పని చేయడకైనా ముందుగా కుడిచేతినే ముందుకు వస్తూ ఉంటుంది. ఇక ప్రపంచంలో చాలామందికి కుడిచేతి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *