Breaking News

భర్తను కోల్పోయిన అనురాధ తో ఆమె తల్లి ఎలా ప్రవర్తించిందో తెలుసా ?

ఐటెం సాంగ్స్‌తో తనకంటూ స్పెషల్ రికగ్నిషన్‌, క్రేజ్ ఏర్పరుచుకున్న నటి అనురాధ. తన అసలు పేరు సులోచన కాగా తెరమీద అనురాధ పేరుతో ఇంట్రడ్యూస్ అయింది. డ్యాన్స్‌తో పాటు నటనలోనూ ప్రతిభ కనబరిచింది అనురాధ. ఐటెం నెంబర్స్ కోసం అనురాధను సంప్రదించే మేకర్స్ అప్పట్లో బోలెడు మంది ఉండే వారట.

తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు, హిందీ, భాషల్లో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది ఈ సీనియర్ నటి. మలయాళ సినిమాల్లో అయితే హీరోయిన్‌గా‌నూ నటించింది. ఇకపోతే తెర మీద సంగతులు అలా ఉంచితే తెర వెనుక రియల్ లైఫ్‌లో నటీమణి అనురాధ పలు విమర్శలను ఎదుర్కొంది.

తనకంటే వయసులో చాలా చిన్నవాడైన సతీశ్ కుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ విషయమై నటీమణి అనురాధను ఇండస్ట్రీ వ్యక్తులతో పాటు తన కుటుంబీకులు విమర్శించారు. అనురాధను ఆమె తల్లి కూడా విమర్శించింది. సతీశ్ అనే వ్యక్తికి దూరంగా ఉండాలని చెప్పింది. అయితే, మిగతావారు ఎవరు ఏమన్నా పట్టించుకోని అనురాధ తల్లి అలా అనడంతో చాలా బాధపడిపోయింది. మ్యారేజ్ అంటూ చేసుకుంటే అది సతీశ్‌ను మాత్రమే అని డిసైడ్ అయి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.

సతీశ్‌ను పెళ్లి చేసుకుని హాయిగా నూతన జీవితాన్ని ప్రారంభించింది. అయితే, అనుకోకుండా నటీమణి అనురాధ జీవితంలో విషాద ఘటన జరిగింది. బైక్ యాక్సిడెంట్‌లో సతీశ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ క్రమంలో సతీశ్ ఇక చనిపోతాడని డాక్టర్స్ చెప్పినప్పటికీ అనురాధ భర్తకు సపర్యలు చేసింది. అనురాధ చేతి ముద్దలు తింటూనే సతీశ్ ఆరోగ్య పరిస్థితి విషమించి 2007లో ప్రాణాలు కోల్పోయాడు. తన కంటే ఏజ్‌లో చాలా చిన్న వాడైన వ్యక్తితో అనురాధ మ్యారేజ్ చేసుకుందని చాలా మంది అవహేళన చేశారు. అయితే, అటువంటి మాటలకు, కామెంట్స్‌కు అనురాధ ఏమాత్రం కుంగిపోలేదు. హస్బెండ్‌ను తన బిడ్డలాగా ప్రాణం పోయేంత వరకు కాపాడుకుంది. భర్తకు సేవలు చేసి గొప్ప ఇల్లాలిగా అనురాధ మిగిలిపోయింది.

About Mamatha

Check Also

ఎడమచేతి వాటంగల సెలబ్రిటీలు వీళ్ళే..!!

సాధారణంగా చాలా మందికి ఏ పని చేయడకైనా ముందుగా కుడిచేతినే ముందుకు వస్తూ ఉంటుంది. ఇక ప్రపంచంలో చాలామందికి కుడిచేతి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *