Breaking News

పదో తరగతిలోనే ప్రేమలో పడ్డ ‘సిరి’.. అతన్ని బతికించుకోలేకపోయానంటూ కన్నీళ్లు..

తెలుగు పాపులర్ రియాలిటీ ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ను ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. హౌస్‌లో కంటెస్టెంట్స్ టాస్కులు పూర్తి చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే హౌస్‌లో లవ్ స్టోరిస్ చర్చ నడుస్తున్నది. కంటెస్టెంట్స్ తమ లవ్ స్టోరిస్ షేర్ చేసుకుంటున్నారు. తాజాగా సిరి తన ప్రేమకథను పంచుకోగా, ఆ లవ్ స్టోరి అందరినీ ఆకట్టుకుంది.

పదో తరగతిలో తాను ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోయానని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది సిరి. ఈ క్రమంలోనే తన లవర్ పేరు చెప్పింది. తను ప్రేమించిన అబ్బాయి పేరు విష్ణు అని, అతడిని ముద్దుగా ‘చిన్నా’ అని పిలిచేదానన్ని పేర్కొంది. తను కాలేజ్ ఫ్రెండ్స్‌తో మాట్లాడినా అతడు తట్టుకోలేకపోయాడని, ఈ విషయమై తమ మధ్య లొల్లి అయిందని, ఈ నేపథ్యంలో తనకు ఓ పెళ్లి సంబంధం వచ్చిందని తెలిపింది. అలా తాను పెళ్లికి ఓకే చెప్పానని, అయితే, విష్ణు తనకు రేపు ఎంగేజ్‌మెంట్ ఉందని తెలుసుకుని ముందు రోజు తాను కావాలని తన వద్దకు వచ్చి కాళ్లపై పడిపోయి ఏడ్చాడని పేర్కొంది.

అలా అతడితో పెళ్లికి ముందర పారిపోయానని, తర్వాత తన తల్లితో మాట్లాడి వెనక్కు వచ్చానని చెప్పింది. ఆ తర్వాత కూడా విష్ణుతో రిలేషన్ షిప్ బాగానే కొనసాగిందని, ఓ రోజు తెల్లవారు జామున మూడు గంటలకు మెలకువ వచ్చిందని, అయినా మళ్లీ పడుకున్నానని 8 గంటలకు లేవగానే విష్ణు చనిపోయాడన్న వార్త తెలిసిందని సిరి బోరున విలపించింది. యాక్సిడెంట్‌లో విష్ణు చనిపోయాడని చెప్తూ ‘ఐ లవ్ యూ విష్ణు’ అంటూ సిరి ఏడస్తుండగా, హౌస్‌లో ఉన్న వాళ్లంతా ఎమోషనల్ అయ్యారు.

ఇకపోతే ఈ సంగతి ఇలా ఉంచితే హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ ఫన్నీగానే సాగుతున్నది. ఇక హౌస్‌లో ఇప్పటి వరకు స్నేహితులుగా ఉన్న సిరి-షణ్ముక్ మధ్య విభేదాలు తలెత్తాయి. కెప్టెన్సీ టాస్క్ పోటీలో భాగంగా రవికి ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌ను ‘బిగ్ బాస్’ రివీల్ చేయగా, ప్రియ నెక్లెస్ దొంగిలించే టాస్క్‌ను రవి సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసి పోటీదారు అయ్యాడు. ఇక ఆ తర్వాత ‘అమెరికా అబ్బాయి హైదరాబాద్ అమ్మాయి’ టాస్క్ కోసం మూడు టీమ్స్‌లో బెస్ట్ పర్ఫార్మర్‌ను ఎంపిక చేసుకోవాలని ‘బిగ్ బాస్’ చెప్పడంతో అందరు కంటెస్టెంట్స్ చర్చించుకుని శ్రీరామ్, జెస్సీ, శ్వేతను పోటీదారులుగా సెలక్ట్ చేశారు. ఈ కెప్టెన్సీ టాస్క్‌కు లోబో సంచాలకుడిగా వ్యవహరించాడు. పోటీలో భాగంగా స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న కెప్టెన్ అనే అక్షరాలను ఒక్కొక్కటి పట్టుకుని వచ్చి అన్నిటినీ ముందు ఎవరైతే పేరుస్తారో వారే కెప్టెన్ అవుతారు.ఈ టాస్క్‌ను జెస్సీ పూర్తి చేయడంతో ‘బిగ్ బాస్’ జెస్సీని మూడో కెప్టెన్‌గా ఎంపిక చేసింది.

About Mamatha

Check Also

ఎడమచేతి వాటంగల సెలబ్రిటీలు వీళ్ళే..!!

సాధారణంగా చాలా మందికి ఏ పని చేయడకైనా ముందుగా కుడిచేతినే ముందుకు వస్తూ ఉంటుంది. ఇక ప్రపంచంలో చాలామందికి కుడిచేతి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *