Breaking News

ఛార్మీ తొలి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

తన బరువైన అందాలతో కుర్రకారుకు కునుకు లేకుండా చేసిన హాట్ బ్యూటీ ఛార్మీ. తన అందచందాలతో పాటు చక్కటి అభినయంతో తెలుగు జనాల మనుసులు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. 2001లో నీతోడు కావాలి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ పంజాబీ భామ. కేవలం తన14వ ఏటనే హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీఅంజనేయం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు ఛార్మీ. వరుసగా చక్రం, పౌర్ణమి, రాఖీ, మాస్, చంటీ, మంత్ర లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అయితే తన తొలి సినిమాకు గాను ఛార్మీ చాలా తక్కువ పారితోషకం తీసుకుందట. ఇంతకీ ఆమె తొలి సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..

ఛార్మీ తాజాగా తన తొలి రెమ్యునరేషన్ గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. స్కూల్లో చదువుతున్నప్పుడు ఓ సినిమాలో జూనియర్ ఆర్టిస్టుగా చేసిందట. అందుకు గాను తనకు రెండు వందల రూపాయలు ఇచ్చారట. ప్రస్తుతం ఛార్మీ నటనకు గుడ్ బై చెప్పి.. నిర్మాతగా మారింది. దర్శకుడు పూరీ జగన్నాథ్ తో కలిసి విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా అనన్య పాండే చేస్తుంది. ఈ సినిమాను ప్యాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు.. ప్రముఖ ఓటీటీ నుంచి ఈ సినిమాకు రూ. 200 కోట్ల భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది

రూ.125 కోట్ల బడ్జెట్ తో లైగర్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి నటిస్తున్నాడు. ఇందులో తను డాన్ గా కనపిస్తాడట. రమ్యక్రిష్ణ కూడా ఈ సినిమాలో ఓ కీ రోల్ ప్లే చేస్తుందట. కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. లేదంటే ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండేది.

About Mamatha

Check Also

పదో తరగతిలోనే ప్రేమలో పడ్డ ‘సిరి’.. అతన్ని బతికించుకోలేకపోయానంటూ కన్నీళ్లు..

తెలుగు పాపులర్ రియాలిటీ ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ను ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. హౌస్‌లో కంటెస్టెంట్స్ టాస్కులు పూర్తి చేస్తూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *