Breaking News

గంజి కోసం గిన్నె పట్టుకొని లైన్ లో నిలబడ్డ చిరంజీవి.. ఎన్ని కష్టాలు పడ్డాడో ?

చిరంజీవి.. తరచుగా వాడే ఓ మాట ఉంది. అదేంటంటే.. నాకు గంజి తెలుసు.. బెంజి తెలుసు అంటాడు. అవును.. మద్రాసులో సినిమా అవకాశాల కోసం తను ప్రయత్నిస్తున్న రోజుల్లో ఆయన పడిన కష్టాలు చాలా అంటే చాలా ఉన్నాయి. అందుకే ఆయన ఈ మాట పదే పదే చెప్తుంటాడు. కష్టం విలువ తెలిసిన వ్యక్తి తను. ఇండస్ట్రీలో ఎలాంటి అండ లేకున్నా.. స్వతహాగా పైకి వచ్చిన నటుడు. సినిమాలపై మోజుతో మద్రాసు వెళ్లిన చిరంజీవి.. కమెడియన్ సుధాకర్ తో పాటు మరో వ్యక్తితో కలిసి ఒకే అద్దే గదిలో ఉండేవారు. తినడానికి తిండి కూడా సరిగా ఉండేది కాదు.. ఏది ఉంటే అది తిని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగే వాడు. ఒక్కోసారి ఏమీ లేకుంటే మంచి నీళ్లు తాగి పడుకునే వాడు.

ఒకానొక సమయంలో తన గది పక్కనే ఉన్న వాళ్లు అన్నం వండే సమయంలో గంజి తీసేవాళ్లు. దాన్ని చిరంజీవికి ఇచ్చేవారు. దానితో కడుపు నింపుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అంతేకాదు.. ఆకలి అయితే.. ఉదయం ఎదుటి వాళ్లు ఇచ్చే గంజి కోసం చాలా సేపు ఎదురు చూసేవాడు కూడా. కష్టాల కడలిలో ఉన్న ఆయనకు నెమ్మదిగా సినిమా అవకాశాలు రావడం.. ఆ తర్వాత వరుస విజయాలతో మెగాస్టార్ గా ఎదిగిపోవడం జరిగాయి. అందుకే అతడు తనకు గంజి, బెంజి తెలుసు అనే మాటలను తరుచుగా వాడుతుంటాడు.

కొద్ది రోజుల క్రితం కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్.. కరోనా సాయం పేరిట కోటి రూపాయలు మాత్రమే ఇచ్చాడని.. సోనూ సూద్ లాంటి హీరోలు కోట్ల రూపాయలు పేదల కోసం ఖర్చు చేస్తున్నారని చెప్పాడు. ఈ మాటలపై మరో కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. కష్టపడి పైసా పైసా సంపాదించిన వాడికే డబ్బు విలువ ఏంటో తెలుస్తుందని చెప్పాడు. ఎదుటి వారి గురించి మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని వెల్లడించాడు.

About Mamatha

Check Also

పదో తరగతిలోనే ప్రేమలో పడ్డ ‘సిరి’.. అతన్ని బతికించుకోలేకపోయానంటూ కన్నీళ్లు..

తెలుగు పాపులర్ రియాలిటీ ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ను ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. హౌస్‌లో కంటెస్టెంట్స్ టాస్కులు పూర్తి చేస్తూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *