Breaking News

అబ్బాస్ ఎందుకు చనిపోవాలి అనుకున్నాడో తెలుసా?

అబ్బాస్.. నైంటీస్ లో యుతకు ఫ్యాషన్ ఐకాన్. తనలా హేర్ స్టైల్ తో లవర్ బాయ్ గా మారిపోయారు కుర్రకారు. అప్పట్లో ఏ హెయిర్ సెలూన్ చూసినా తన ఫోటోలే ఉండేవి. కుర్రాళ్లంతా అబ్బాస్ స్టైల్ కటింగ్ కావాలని చెప్పేవారు. అప్పట్లో ప్రతి ఒక్కరూ అబ్బాస్ లా ఫీలవడానికి కారణం లేకపోలేదు. అదేంటంటే.. ఆయన నటించి ప్రేమ దేశం మూవీ. ఈ సినిమా ద్వారా కాలేజీ స్టూడెంట్స్ అంతా అబ్బాస్ లా కటింగ్ ఇచ్చేవారు. తెలుగు వారినే కాదు.. తమిళులకు కూడా అభిమాన హీరోగా మారిపోయాడు.

1996లో కుంజుమన్ నిర్మాణంలో కదిర్ ప్రేమదేశం సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో వినీత్, అబ్బాస్, టబు నటీనటులుగా చేశారు. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ సినిమా విజయంతో కుర్రకారుకు అభిమాన హీరోగా మారిపోయాడు అబ్బాస్. అబ్బాస్ అసలు పేరు మీర్జా అబ్బాస్ అలీ. అతడి తాత ఫిరోజ్ ఖాన్. తను కూడా సినిమా పరిశ్రమలో ఉన్నాడు. 1960 నుంచి 70 వరకు తనూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అబ్బాస్ తెలుగు సినిమాతో పాటు తమిళం, కన్నడ, మలయాళం సినిమా పరిశ్రమల్లోనూ మంచి అవకాశాలు పొందాడు. అనంతరం తను 2000 సంవత్సరంలో తన సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్ గా పని చేశాడు. అదే సమయంలో ఎరుమ్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు, బిడ్డలు జన్మించారు. 2003లో తనకు అస్సలు సినిమా అవకాశాలు రాలేదు. దీంతో తను మానసికంగా కుంగిపోయాడు. అప్పుడే తను చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో భార్య పిల్లలు గుర్తుకు వచ్చి చనిపోవాలనే కోరికను విరమించుకున్నాడు. ఆ తర్వాత వీరిందరినీ తీసుకుని న్యూజీలాండ్ వెళ్లాడు. అక్కడ జాబ్ లేక పెట్రోల్ బంకులో పని చేశాడు. ఆ తర్వాత మోటివేషనల్ స్పీకర్ గా మారాడు. ఆ తర్వాత కాస్త ఆర్థికంగా బలపడి ప్రస్తుతం సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు.

About Mamatha

Check Also

పదో తరగతిలోనే ప్రేమలో పడ్డ ‘సిరి’.. అతన్ని బతికించుకోలేకపోయానంటూ కన్నీళ్లు..

తెలుగు పాపులర్ రియాలిటీ ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ను ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. హౌస్‌లో కంటెస్టెంట్స్ టాస్కులు పూర్తి చేస్తూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *