Breaking News

Romantic Movie Review : ఆకాశ్ పూరి ‘రొమాంటిక్’ సినిమా..ఫాన్స్ కి సూపర్ షాక్ ఇచ్చాడుగా !

Romantic Movie : టాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన కొడుకు ఆకాశ్‌ను స్టార్‌ హీరోగా తీర్చిదిద్దేందకు బాగా కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆకాశ్ పూరి నటించిన రొమాంటిక్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆకాశ్‌కు జంటగా కేతిక శర్మ నటించింది. సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా ఇందులో ఓ కీలక పాత్ర పోషించింది.

రొమాంటిక్ చిత్రానికి పూరి జగన్నాధే స్వతహాగా కథ, స్క్రీన్ ప్లే,మాటలు అందించడం.. రమ్యకృష్ణ పవర్ ఫుల్ పోలీస్‌ ఆఫీసర్ పాత్రలో కనిపించడంతో పాటు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు చీఫ్ గెస్ట్‌గా రౌడీ బాయ్ ‘విజయ్ దేవరకొండ’ రావడం.. అదేవిధంగా రెబల్ స్టార్ ‘ప్రభాస్’ నటీనటులను ఇంటర్వ్యూ చేయడం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.

యువత మెచ్చే అంశాలు…

పూరి జగన్నాధ్ దగ్గర పనిచేసిన అనిల్ పాదూరి రొమాంటిక్ చిత్రానికి దర్శకత్వం వహించారు. పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్‌, పూరి ప‌తాకంపై హీరోయిన్ ఛార్మితో కలిసి సంయుక్తంగా నిర్మించారు దర్శకుడు పూరిజగన్నాధ్.. ‘ప్రేమ, మోహం’ అనే కొత్త ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. హీరో హీరోయిన్ మధ్య ఉన్నది మోహమా.. ప్రేమ అనేది ఎలా తెలుస్తుందనేది ఈ మూవీ కాన్సెప్ట్..

యాక్టింగ్ పరంగా ఒకే అనిపించుకున్న నటీనటులు

రొమాంటిక్‌లో ఆకాష్ నటన బాగుంది. మూవీ క్లైమాక్స్‌లో అతని యాక్టింగ్‌కు అందరూ ఫిదా అయిపోతారు. హీరోయిన్ కేతిక శర్మ యాక్టింగ్ కూడా ఈ సినిమాకు ప్లస్ అవుతుంది.. కేతికశర్మ కుర్రకారు కోసం తన అంద చందాలను బాగానే ఆరబోసింది. రొమాన్స్ బేస్డ్‌గా ఈ సినిమాలో చాలా సన్నివేశాలు ఉన్నాయి. ముఖ్యంగా రొమాంటిక్ మూవీ యూత్‌ను బాగా మెప్పిస్తుంది. రమ్యకృష్ణ నటన కూడా సినిమా విజయానికి కారణం అవుతుంది.

ఓవరాల్‌గా సినిమా ఎలా ఉందంటే..

లీడ్ యాక్టర్స్ నటన, సాంగ్స్ ఈ సినిమాకు ప్లస్ అవుతాయి. యువతను బాగా అలరిస్తుంది. ఎక్కువగా రొమాన్స్ సీన్స్ ఉండటం వలన యువత మాత్రమే ఈ సినిమాను ఇష్టపడుతారు. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఆదరణ ఉండకపోవచ్చును.. మొత్తంగా ఈ సినిమా విజయం సాధిస్తుందా లేదా అనేది ప్రేక్షకులే డిసైడ్ చేయాలి.. రొమాంటిక్ మూవీకి మేము ఇచ్చే రేటింగ్ 3/5..

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *