Breaking News

Review : ఎన్ఐఏ అధికారిగా అదరగొట్టిన కార్తికేయ.. రాజా విక్రమార్కతో బంఫర్ హిట్..!

ఆర్‌ఎక్స్100 మూవీతో ఓ రేంజిలో హిట్ కొట్టాడు హీరో కార్తికేయ. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమా తర్వాత కొన్ని సినిమాలు చేసినా అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు. నటన పరంగా ఫర్వాలేదు అనిపించినా.. సినిమాలు మాత్రం అంతగా సక్సెస్ కాలేదు. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలి అనే టార్గెట్ తో రాజా విక్రమార్క అనే సినిమాలో నటించాడు. తాజాగా ఈ సినిమా విడుదల అయ్యింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? కార్తికేయ ఏమేరకు సక్సెస్ అయ్యాడు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

రాజా విక్రమార్క సినిమాను శ్రీ సరిపల్లి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. ఈ సినిమాలో సుధాకర్‌ కోమాకుల, సాయికుమార్‌ పలు కీలక పాత్రలు చేశాడు. తాన్య రవించంద్రన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కార్తికేయతో పాటు ముగ్గురు ఎన్ఐఏ ఉద్యోగులతో ప్రారంభం అవుతుంది. ఈ బ్యాచ్ కు తనికెళ్ల భరణి చీఫ్. ఓ టాస్క్ లో భాగంగా ఓ ఉగ్రవాదని పట్టుకుని కాల్చి చంపేస్తారు. హీరోగా కార్తికేయ ఎంట్రీ ఫర్ఫెక్ట్ టైమింగ్ ప్రకారం ఉంటుంది. అటు హోంమంత్రిగా సాయి కుమార్ కూడా అనుకున్న సమయానికే తెర మీద కనిపిస్తాడు. ఆయనను ఓ కొంతమంది కిడ్నాప్ చేస్తారు. ఆ కిడ్నాపర్స్ నుంచి తనను విడిపించడమే లక్ష్యంగా ఓ సీక్రెట్ ఆపరేషన్ చేస్తారు. నిజానికి వాళ్లు ఎన్ఐఏ అధికారులు అనే విషయాన్ని ఎవరికీ చెప్పారు.ఈ హోంమంత్రి కూతురే హీరోయిన్ తాన్య రవిచంద్రన్. ఆపరేషన్ లో భాగంగా హీరోయిన్ కు డాన్స్ నేర్పించే మాస్టర్ కి అసిస్టెంట్ గా కార్తికేయ హోంమంత్రి ఇంటికి వెళ్తాడు. అక్కడే హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ ఏర్పడుతుంది.

ఈ సినిమాలో పోలీస్ అధికారిగా సుధాకర్ కోమాకుల కనిపిస్తాడు. ఆయన కూడా హోంమంత్రిని కాపాడే మిషన్ కోసం కార్తికేయతో కలిసి పనిచేస్తాడు. ఓ ఇనాగరేషన్ వేడుకలో హోంమంత్రిని కొందరు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తారు. దాన్ని ఎన్ ఐ ఏ టీం అడ్డుకుంటుంది. ఆ సమయంలోనే కార్తికేయ బ్యాచ్ ఎన్ ఐఏ టీం అని తెలుస్తుంది. అదే సమయంలో హోంమంత్రికి బదులుగా ఆయన కూతురు కిడ్నాప్ అవుతుంది. దీంతో ఫస్టాప్ ఎండ్ అవుతుంది. ఇప్పటి వరకు సినిమా చాలా కూల్ గా కొనసాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత ఎన్ఐఏ, పోలీసులు, కిడ్నాపర్లకు మధ్య డిస్కషన్స్, ఛేంజింగ్ చాలా పవర్ ఫుల్ గా కొనసాగుతుంది. అటు హీరో అనుకోకుండా హోంమంత్రిని కాల్చేయడంతో మరో ట్విస్టు ఉంటుంది. అదే సమయంలో కిడ్నాపర్ ను చంపేస్తాడు. అయినా హీరోయిన్ ను కిడ్నాపర్ల చెర నుంచి విడిపించలేరు. అటు సినిమా స్పీడ్ అందుకుంటుంది. కిడ్నాపర్లు డబ్బు డిమాండ్ బాగా పెరుగుతుంది. వాళ్లకు డబ్బు ఇచ్చే సమయంలో హీరోయిన్ ను కాపాడుతారు. ఆ సమయంలో జరిగే క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఎన్‌ఐఏ అధికారిగా ఆ అమ్మాయిని కాపాడుతాడు. దీంతో ఆ సినిమా ఎండ్ అవుతుంది. మొత్తంగా ఈ సినిమా అదుర్స్ అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ నటనతో పాటు మిగతా నటుల ఫర్మార్మెన్ అదుర్స్ అనిపిస్తుంది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *