Breaking News

Pushpaka Vimanam Movie Review : మూవీ పుష్పక విమానం మూవీ రివ్యూ ..

విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆనంద్ దేవరకొండ.. ఇప్పటికే రెండు సినిమాలు చేసినా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. తాజాగా ఆయన నటించిన మూడో సినిమా విడుదల అయ్యింది. కామెడీ, సస్పెన్స్ థిల్లర్ కథను ఈ సినిమా కోసం ఎంచుకున్నాడు దర్శకుడు. పుష్పక విమానం పేరుతో తెరకెక్కిన ఈ సినిమా.. ఇవాళ జనాల ముందుకు వచ్చింది. విజయ్ దేవరకొండ నిర్మించడమే కాదు.. ఈ సినిమాకు ఓ రేంజిలో ప్రమోషన్ చేశాడు. అన్నదమ్ముల ప్రమోషన్ తో పాటు సినిమా ట్రైలర్ జనాలకు ఓ రేంజిలో నచ్చింది. దీంతో ఈ సినిమాపై జనాలు మరిన్ని అంచనాలుపెట్టుకున్నారు. ఇంతకీ ఈ సినిమా జనాలను ఏరేంజిలో ఆకట్టుకుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

సినిమా స్టోరీ ఏంటంటే..
స్కూల్లో టీచర్ గా పనిచేస్తాడు సుందర్(ఆనంద్ దేవరకొండ). పెద్దలు కుదిర్చిన అమ్మాయి మీనాక్షిని(గీతా సైని) వివాహం చేసుకుంటాడు. అయితే సుందర్ తో పెళ్లి నచ్చని అమ్మాయి ప్రియుడితో వెళ్లిపోతుంది. ఈ విషయం బయకు తెలిస్తే పరువు గంగలో కలుస్తుందని.. ఆ అమ్మాయి తనతోనే ఉన్నట్లు నమ్మిస్తాడు. పోలీస్ అధికారి సునీల్ ఎంట్రీతో సుందర్ కు చాలా సమస్యలు వస్తాయి. అయితే వెళ్లిపోయిన మీనాక్షి ఎక్కడ? ఆమె ఎక్కడ ఉంది? అసలు బతికే ఉందా? చివరకు సుందర్-మీనాక్షి కలుస్తారా? అనేది సినిమా కథ.

పెళ్లయిన అమ్మాయి లేచిపోవడం అనే పాయిట్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. కామెడీతో పాటు సస్పెన్స్ ను మేళవించి ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు దామోదర్. తొలి భాగంలో భార్య లేచిపోవడాన్ని బయకు చెప్పకుండా సుందర్ పడే కష్టాలను సమాజం కోణంలో చూపించే ప్రయత్నం చేశాడు. ఇంతకీ మీనాక్షిని లేపుకుపోయింది ఎవరు? అనే సస్పెన్సుతో ఫస్టాప్ ఫర్వాలేదు అనిపించాడు. అయితే సెకెండ్ హాఫ్ మాత్రం అంతగా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. రెండో భాగంలో కామెడీ తగ్గిపతుంది. క్రైమ్ తో పాటు సస్పెన్స్ ముఖ్యంగా సినిమా ముందుకు సాగుతుంది. పోలీస్ ఆఫీసర్ సునీల్ ఇన్వెస్టిగేషన్ కూడా అంతగా ఆసక్తికరంగా ఉండదు. క్లైమాక్స్ కూడా అంతగొప్పగా ఏమీ ఉండదు.

ఎవరు ఎలా చేశారంటే?
అయితే ఈ సినిమాలో ఆనంద్ నటన మాత్రం చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. అటు గీతా సైని కూడా ఫర్వాలేదు అనిపించింది. హీరోయిన్ కు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. సినిమా కథ అంతా ఆనంద్ చుట్టూనే తిరుగుతుంది. అటు హీరోను అనుమానించే పోలీస్ పాత్రలో సునీల్ బాగా ఆకట్టుకున్నాడు. ఇక ప్రొడక్షన్ పరంగా ఫర్వాలేదు అనిపించింది. మొత్తంగా కామెడీ, సస్పెన్స్ ను ముఖ్యంగా తీసుకున్న దర్శకుడు.. రెండో భాగంలో మాత్రం ఫ్లాప్ అయ్యాడు. మొత్తంగా ఈ సినిమా స్టోరీ అంతగొప్పగా లేదు. సస్పెన్సూ ఆకట్టుకోదు. ఈ సినిమా యావరేజ్ అని చెప్పుకోవచ్చు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *