Breaking News

LIC ఏజెంట్ గా ఎన్నో కష్టాలు పడి కూతురిని హీరోయిన్ చేసిన ఐశ్వర్య రాజేష్ తల్లి

ఐశ్వర్య రాజేష్. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని ముందుకు సాగుతుంది. వాస్తవానికి ఐశ్వర్య తాత, తండ్రి కూడా సినిమా పరిశ్రమతో సంబంధం ఉన్నవాళ్లే. తాత అమర్నాథ్ పలు సినిమాలను నిర్మించాడు కూడా. తండ్రి రాజేష్ మల్లెమొగ్గలు, రెండుజెళ్ల సీత, ఆనంద భైరవి అనే సినిమాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన మేనత్త శ్రీలక్ష్మి అయితే తెలుగు, తమిళ భాషల్లో సుమారు 500 సినిమాలకు పైగా చేసింది. ఎంత సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా.. ఐశ్యర్య ఫ్యామిలీ ఎన్నోకష్టాలు పడింది. ఇంతకీ ఆ కుటుంబం ఎందుకు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఒకప్పుడు హైదరాబాద్ లోనే ఉన్న ఐశ్వర్య రాజేష్ కుటుంబం చెన్నైకి వెళ్లింది. అక్కడ పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న ఐశ్వర్య తండ్రి రాజేష్. కానీ అతి మంచితనం మూలంగా వచ్చిన డబ్బునంతా దాన ధర్మాలకే ఉపయోగించాడు. అటు తెలిసివారని చెప్పి అడిగిన వెంటనే షూరిటీలు పెట్టాడు. ఆ తర్వాత తను తాగుడుకు బానిసై అనారోగ్యానికి గురయ్యాడు. ఈ సమయంలో ఐశ్వర్య తల్లి కుటుంబాన్ని పోషించేందుకు ఎల్ఐసీ ఏజెంటుగా మారింది. ఓ వైపు భర్తకు వైద్యం అదిస్తూనే… మరోవైపు ఐశ్వర్యతో పాటు ముగ్గురు అబ్బాయిలను పోషించేది. కొంత కాలం తర్వాత రాజేష్ ఆరోగ్యం చెడిపోయి చనిపోయాడు. అప్పుడు ఐశ్వర్య వయసు కేవలం 8 సంవత్సరాలు. ఆ తర్వాత కుటుంబ భారం అంతా తన మీదే పడింది. అటు అప్పులు తీసుకున్నవారు డబ్బులు కట్టకపోవడంతో వచ్చి ఐశ్వర్య వాళ్ల ఇంటిమీద పడ్డారు. వాళ్లమ్మ ఉన్న ఒక్క ఫ్లాట్ అమ్మి ఆ డబ్బును వారికి చెల్లించింది. తన పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉండేది.

అదే సమయంలో ఐశ్వర్య సీరియల్స్ లో నటించడం మొదలు పెట్టింది. పొద్దంతా కష్టపడితే 500 రూపాయలు వచ్చేవి. ఆ డబ్బు సరిపోయేది కాదు. సినిమాల్లోకి వెళ్తే ఎక్కువ డబ్బు వస్తుందని ట్రై చేసింది. కానీ చాలా మంది తనను అవమానించేలా మాట్లాడారు. అయినా వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లింది ప్రస్తుతం హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *