Breaking News

Jr. NTRకి పునీత్ రాజ్ కుమార్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

కన్నడ సూపర్ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణం దేశ వ్యాప్తంగా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఆయన అభిమానులతో పాటు యావత్ దేశ ప్రజాలు ఆయన మరణం పట్ల కంట తడి పెడుతున్ను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

నిజానికి రాజ్ కుమార్ కన్నడలోనే ఎక్కువ సినిమాలు చేశాడు. ఇతర భాషల్లో ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేశాడు. అయినా జనాలకు ఇంత క్రేజ్ ఎలా వచ్చింది అనేది ఆశ్చర్యం కలిగించక మానదు. ఆయన సినిమాల కంటే తను చేసిన మంచి పనులే దేశ వ్యాప్త గుర్తింపు వచ్చేలా చేశాయి. దేశ వ్యాప్తంగా ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిన ఫీలింగ్ జనాల్లో కలుగుతోంది. అలాంటి పునీత్ మరణం పట్ల జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఆయన అభిమానులు కూడా చాలా బాధ పడుతున్నారు.

ఇంతకీ ఎన్టీఆర్ అభిమానులకు ఆయనకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ప్రనీత్ రాజ్ కుమార్ అంటే ఎన్టీఆర్ కు చాలా ఇష్టం. పునీత్, ఎన్టీఆర్ మంచి మిత్రులు. పునీత్ రాజ్ కుమార్ సినిమా చక్రవ్యూహ సినిమాలో ఎన్టీఆర్ ఓ పాట కూడా పాడాడు. థమస్ సంగీత దర్శకత్వంలో ఆయన ఈ పాట పాడాడు. అప్పట్లో కన్నడ నాట ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నా ఆయన కోసం వీలు చేసుకుని వెళ్లి మరీ పాట పాడాడు. ఈ పాట అద్భుత విజయం అందుకోవడంతో ఇద్దరి మధ్య స్నేహం మరింత పెరిగింది. అంతేకాదు.. ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాల సినిమాను తను కన్నడలో రీమేక్ చేశాడు. ఈ సినిమాతో పునీత్ రేంజ్ అమాంతం పెరిగింది. ఆ దెబ్బతో ఎన్టీఆర్ పై ఆయనకు ఎంతో ఇష్టం పెరిగింది. అంతేకాదు.. ఎన్టీఆర్ సినిమాలను కన్నడలో ఎంతో ప్రోత్సహించాడు కూడా. అలా ఇద్దరి మధ్య స్నేహం మరింత పెరిగింది. పునీత్ మరణం పట్ల ఎన్టీఆర్ ఎంతో ఆవేదన వ్యక్తం చేశాడు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *