Breaking News

6 రోజుల పాటు కారులో నరకం .. ఎన్నో కష్టాలను అనుభవించిన శృతి హాసన్ తల్లి

బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రుతి హాసస్ మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి అందరికీ విదితమే. సింగర్, యాక్టర్, మ్యుజీషియన్‌గా శ్రుతి దూసుకుపోతుంది. ఆమె సంగతి పక్కనబెడితే.. శ్రుతిహాసన్ తల్లి, విశ్వనటుడు కమల్ హాసన్ మాజీ భార్య సారిక జీవితం విషయానికొస్తే.. ఆమె ఎన్నో కష్టాలు పడి జీవితంతో పోరాడి మరి గెలిచింది. పసిప్రాయంలోనే ఫిల్మ్ స్టూడియోల చుట్టూ తిరిగింది. ఒకానొక దశలో తల్లిదండ్రులను విడిచిపెట్టి చాలా కష్టాలు పడి యాక్ట్రెస్ అయింది. 21 ఏళ్ల సమయంలో చేతిలో డబ్బులు లేకుండా ఇంటి నుంచి ఏం తీసుకెళ్లకుండా కేవలం తాను వేసుకున్న డ్రెస్‌తోనే ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక కారులో ఆరు రోజుల పాటు ఉండిపోయిందట. ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు సాధించి హీరోయిన్‌గా ఎదిగింది.

సారిక 28 ఏళ్ల వయసులో విశ్వనటుడు కమల్ హాసన్ పెళ్లి చేసుకుని నటనకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఆ తర్వాత తన కూతుర్లు శ్రుతి, అక్షరను పెంచుకుంటూ ముందుకు సాగుతున్న క్రమంలోనే కమల్ హాసన్‌ను వదిలిపెట్టి ఒంటరిగానే జీవితాన్ని ముందుకు తీసుకెళ్లింది. చెన్నై నుంచి ముంబైకు వచ్చి మళ్లీ సినీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది సారిక. నాలుగేళ్ల వయసులోనే సారిక డైరెక్టర్ బీ.ఆర్.చోప్రా తెరకెక్కించిన ‘హమ్ రాజ్’ చిత్రంలో నటించింది. కెమెరా మందు నటించడం అంటే చాలా ఇష్టమున్న సారిక. ప్రతీ రోజు ఫిల్మ్ స్టూడియోస్‌కు వెళ్లి, తనకు ఆఫర్ చేసిన ప్రతీ పాత్రను పోషించింది. అలా అవకాశాలను అందిపుచ్చుకుని స్టార్‌గా ఎదిగింది. పెళ్లి తర్వాత సారిక టెక్నీషియన్‌గా మారింది. కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హే రామ్’ చిత్రానికి సారిక కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసింది. ఆమెకు ఈ సినిమాకుగాను నేషనల్ అవార్డు వచ్చింది. అయితే, సెకండ్ ఇన్నింగ్స్‌లో తిరిగి నటిగా ఎంట్రీ ఇవ్వాలనుకున్న సారిక టెక్నీషియన్‌గానే రాణించింది. సింగిల్ మదర్‌గా శ్రుతి, అక్షరను పెంచిన సారిక వారి కోసం చాలా కష్టపడింది. ఇకపోతే శ్రుతిహాసన్, అక్షర హాసన్ ఇద్దరూ సినీ ఇండస్ట్రీలో మంచి రికగ్నిషన్ తెచ్చుకుని కెరీర్‌లో దూసుకుపోతుండటం పట్ల సారిక ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *