Breaking News

25 ఏళ్లుగా పనిమనిషి గా ఉన్న మహిళకు ప్రభాస్ ఫ్యామిలీ ఎలాంటి బహుమతి ఇచ్చారో చూడండి

రెబల్ స్టార్ కృష్ణం రాజు. సినిమా పరిశ్రమలోనే కాదు.. బయట కూడా హుందాగానే ఉంటాడు. ఎన్నో వందల సినిమాలు చేసినా.. తనలో ఏమాత్రం ఆటిట్యూడ్ ఉండదు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరినీ ఎంతో ప్రేమగా, గౌరవంగా చూసుకుంటారు. ఆయన కుటుంబం అతిథులకు ఎంతో మంచి మర్యాద చేస్తారనే టాక్ కూడా ఉంది. ఆయన కుటుంబంతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ వారి గురించి గొప్పగానే మాట్లాడుకుంటారు. కృష్ణంరాజుకే కాదు.. ఆయన నట వారసుడిగా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కి కూడా ఇదే మర్యాద అలవాటయ్యింది. తన పెదనాన్న దారిలోనే తనూ నడుస్తున్నాడు.

తన ఇంటికి వచ్చే వారికి ప్రభాస్ అద్భుతమైన ఫుడ్ పెట్టి ఆహా అనేలా చేస్తాడు. పలువురు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ నటీనటులకూ ఆయన బిర్యానీ రుచి చూపించాడు. ఇంటికి వచ్చే అతిథులనే కాదు.. ఇంటి పని మనుషులను కూడా అంతే గౌరవంగా చూసుకుంటాడు. సొంత మనుషుల్లాగే ట్రీట్ చేస్తారు. అందుకు తాజా ఉదాహరణే నిదర్శనం. కృష్ణంరాజు ఇంట్లో గడిచిన 25 సంవత్సరాలుగా పద్మ అనే మహిళ పని చేస్తుంది. ఇన్నాళ్లు తమ కుటుంబానికి అన్ని రకాలుగా సేవలు చేస్తున్నది పద్మ. ఈ సందర్భంగా 25 ఏండ్ల వేడుక నిర్వహించారు కృష్ణంరాజు కుటుంబ సభ్యులు. 25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అంటూ ఆమె చేత కేక్ కట్ చేయించారు కృష్ణంరాజు ఫ్యామిలీ మెంబర్స్. ఈ సందర్భంగా కృష్ణంరాజు దంపతుల ఆశీర్వాదం తీసుకుంది పద్మ. కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి పద్మకు బంగారు చైన్ బహుమతిగా అందజేశారు. ఇన్నేళ్లుగా తమకు తోడుగా ఉన్న పద్మకు ధన్యవాదాలు చెప్తూ తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది ప్రభాస్ సోదరి ప్రసీద. చిన్నప్పటి నుంచి తమను ఎంతో ప్రేమగా చూసుకున్నట్లు వెల్లడించింది. తను ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రసీద ఆకాంక్షించారు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *