Breaking News

1942లో మేకర్స్ పబ్లిసిటీ ట్రిక్స్.. థియేటర్లకు ఎగబడ్డ జనం.. తెలిస్తే మీరు షాక్ !

సినిమా హిట్ కావాలంటే జనాలు థియేటర్లకు వెల్లువెత్తాలి. అలా రావాలంటే.. ఓ రేంజిలో పబ్లిసిటీ వచ్చేలా చేయాలి. ఇలాంటి సినిమా ఇంతకు ముందెన్నడూ తీయలేదు అనే రేంజిలో కలరింగ్ ఇవ్వాలి. అంతేకాదు.. పలు కాంటెస్టులు పెట్టాలి. ప్రేక్షకులకు ఏదైనా కొత్త ఆఫర్ ఇవ్వాలి అప్పుడే సినిమా చూసేందుకు జనాలు వస్తారు. ఇప్పుడే కాదు.. గతంలోనూ కొంతరు నిర్మాతలు పబ్లిసిటీ ట్రిక్స్ ప్లే చేశారు. జనాలను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయ్యారు.

దక్షిణాది సినిమాలు పురడు పోసుకుంటున్న సమయం.. అంటే 1942. అప్పుడే భక్త నందనార్ అనే ఓ తమిళ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా పబ్లిసిటీ కోసం సినిమా యూనిట్ వెరైటీ ప్రయోగం చేసింది. ఈ ట్రిక్ అప్పట్లో సంచలనం అయ్యింది. జెమిని సినిమా బ్యానర్ మీద వాసన్ మురుగదాస్ ఈ సినిమా ను తెరకెక్కించాడు. అప్పట్లో ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అందుకే ఈ సినిమాకు జనాలు తండోపతండాలుగా వచ్చేలా చర్యలు తీసుకోవాలి అనుకున్నారు. అందుకే నిర్మాత వాసన్ అప్పటిదాకా ఎవరూ చేయని ఓ పబ్లిసిటీ గేమ్ ఆడాడు. తమ సినిమాలోని 31 పాటల్లో ఉత్తమమైన మూడు పాటలు సెలెక్ట్ చేసి తమకు పంపించాలని చెప్పాడు. అలా పంపిన వారికి మంచి ప్రైజ్ మనీ ఇస్తామని చెప్పాడు.

ముందు సినిమా చూడాలి. థియేటర్ దగ్గర ఇచ్చే పాటల లిస్టు ఉన్న ఓ పేపర్ మీద నచ్చిన మూడు పాటలకు టిక్ కొట్టి థియేటర్ లో పెట్టిన బాక్సులో వేయాలి. అంతేకాదు.. ఈ సినిమాకు సంబంధించిన పాటల క్యాసెట్ కూడా మార్కెట్ లోకి విడుదల చేయలేదు. ఇంతకీ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? అప్పట్లోనే 10 వేలు. అంటే ఈ రోజుల్లో సుమారు కోటి రూపాయలు. మొత్తానికి ఈ ట్రిక్ తో థియేటర్లు నిండిపోయాయి. నిర్మాతలకు కాసుల పంట పండింది. చివరికి ఓ 20 మందిని సెలెక్ట్ చేసి ఈ బహుమతిని సమంగా పంచారు. అప్పట్లో ఈ పబ్లిసిటీ ట్రిక్ ఎంతో సంచలనంగా నిలిచింది.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *