Breaking News

హోమ్లీ బ్యూటీ పవిత్ర.. ఒకప్పుడు గ్లామర్ పాత్రల్లో ఎలా రెచ్చిపోయిందో తెలుసా?

పవిత్ర లోకేష్. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ఈ అందాల నటీమణి తెలుగులో చక్కటి కుటుంబ పాత్రల్లో నటిస్తుంది. తల్లి పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. అందానికి తోడు అభినయంతో తెలుగు ప్రజల ఫ్యామిలీ మెంబర్ గా మారిపోయింది. ఇప్పుడు పద్దతి గల పాత్రలు చేస్తున్న పవిత్ర.. ఒకప్పుడు మాంచి గ్లామరస్ పాత్రలు పోషించింది. తన అందాలతో అందరినీ ఆహా అనిపించేది. తన అందచందాలతో ఎంతో మందిని మత్తుల్లో ముంచింది ఈ తార. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టి హోమ్లీ క్యారెక్టర్స్ చేయడం మొదలు పెట్టింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ మస్త్ బిజీ అయ్యింది.

ఎప్పుడూ ఫ్యామిలీ పాత్రలు చేసే పవిత్ర తాజాగా విడుదల అయిన రెడ్ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ చేసింది. రామ్ హీరోగా చేసిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో పవిత్ర చైన్ స్మోకర్ గా కనిపించింది. నిజానికి ఆమె ఏనాడూ సిగరెట్ తాగలేదు. తన నిజ జీవితంలో స్మోకింగ్ అలవాటు కూడా లేదు. అయినా ఈ సినిమాలో చక్కటి నటనతో ఆకట్టుకుంది. అటు గిరీష్ కాసరవల్లి మూవీ నాయీ నేరాలు లోని నటనకు గాను తనకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే అవార్డును దక్కించుకుంది.

ఆమె పలు సినిమాల్లో నటిస్తూనే బుల్లితెర పైనా సందడి చేస్తుంది. జీవన్ముఖి, ఈశ్వరి, స్వాభిమానం, ఒలవే నమ్మ బడుగు సహా పలు మెగా సీరియల్స్ నటించింది. ఆ తర్వాత నెమ్మదిగా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. కరెంట్ తీగ, మళ్లీ మళ్లీ ఇది రాణి రోజు, కృష్ణాష్టమి, మిడిల్ క్లాస్ అబ్బాయి, హ్యాపీ వెడ్డింగ్ సహా పలు సినిమాల్లో నటించింది. అంతేకాదు.. పలు సీరియల్స్ తో పాటు సినిమాల్లోనూ నటిస్తూ ముందుకు సాగుతుంది. ఇంకా పలు సినిమాలకు పవిత్ర సైన్ చేసింది. తను ఇప్పుడు తెలుగుతో పాటు కన్నడ సినిమా పరిశ్రమలోనూ బిజీ ఆర్టిస్టుగా మారింది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *