Breaking News

హైపర్ ఆదికి ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ బెదిరింపులు.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన స్టార్ కమెడియన్

Hyper Aadi-Jabardasth: జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్ట్ కామెడీ షోల గురించి తెలుగు రాష్ట్రాల్లో ఎవరినీ అడిగిన చెబుతారు. ఈటీవీ చానెల్ ప్రసారం అయ్యే ఈ కామెడీ షో ఎంతో మంది టాలెంటెడ్ కమెడియన్స్‌‌ను వెలుగులోకి తీసుకొచ్చింది. చాలా మంది యూట్యూబ్‌లో ఈ షోను చూస్తు తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ కామెడీ షోస్ వలన చాలా మంది తమ ఒత్తిడిని తగ్గించుకుంటున్నారని తెలుస్తోంది. నవ్వడం వలన ఆరోగ్యంగా కూడా పదిలంగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే, జబర్దస్త్ కమెడియన్స్ వేసే పంచులు, డబులు మీనింగ్ డైలాగుల వలన వీరు ఒక్కొసారి చిక్కుల్లో పడుతుంటారు. ఇలాంటి కాంట్రవర్సీ పంచులు వేయడంలో స్టార్ కమెడియన్ హైపర్ ఆది ముందుంటాడు. తాజాగా ఇతను చేసిన స్కిట్ వలన ఓ స్టార్ హీరో అభిమానులు ఆదిని టార్గెట్ చేసి బెదిరిస్తున్నారని తెలిసింది.

వి.వి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన‘ఆది’సినిమా ఎంత పెద్ద సూపర్ హిట్టో అందరికీ తెలిసిందే. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ నటనకు తెలుగు ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. ఆ సినిమాలో యంగ్ టైగర్ పేల్చే డైలాగులు ఒకప్పుడు సెన్సెషన్. అయితే, దీపావళి పండుగ సందర్భంగా ఓ ప్రముఖ ఛానెల్‌లో నిర్వహించిన ఫెస్టివల్ ఈవెంట్‌లో ‘ఆది’ సినిమాలో యంగ్ టైగర్ పేల్చిన డైలాగులను ఇమిటేట్ చేస్తూ హైపర్ ఆది కామెడీ చేశాడు. అందరూ కడుపుబ్బా నవ్వుకున్నారు. ఆ తర్వాత అభిమానులు మనోడికి ఊహించని షాక్ ఇచ్చారు. సినీ పరిశ్రమలో బడా హీరోగా కొనసాగుతున్న ఎన్టీఆర్ పై వేసిన పంచులకు గానూ నందమూరి అభిమానులు హైపర్ ఆదిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిసింది. ఆది దొరికితే గట్టిగా బుద్ది చెబుతామని అతని కోసం వెతుకులాట ప్రారంభించినట్టు సమాచారం.

దీంతో ఆది ఎవరికీ కనిపించకుండా తిరుగుతున్నారట.. షూటింగులకు కూడా వెళ్లడం లేదని, ఇంట్లోనే ఉండలేక చివరికు తన సొంత కారులో కూడా తిరగడం మానేసినట్టు టాక్ నడుస్తోంది. గత రెండు, మూడ్రోజుల నుంచి నందమూరి ఫ్యాన్స్ ఆదికి వరుసగా కాల్స్ చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, హైపర్ ఆదికి ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అనేక సార్లు కొంతమంది సెలెబ్రిటీలపై పంచులు వేసి చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆ తర్వాత వారిని క్షమాపణ కోరిన విషయం తెలిసిందే.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *