Breaking News

హీరో నాగశౌర్య ఏంటీ మాకీ కర్మ.. ఫామ్‌హౌస్‌లో ఇలాంటి పనులు చేస్తారా..?

హీరో నాగశౌర్య అనతి కాలంలోనే తెలుగు ఇండస్ట్రీలో మంచి నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. తనదైన యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్‌ కుర్ర హీరోల్లో ముందు వరుసలో నిలిచారు. చలో సినిమాతో మనోడికి మంచి హిట్ పడినా, ఊహలు గుసగుసలాడే వంటి క్లాసిక్ లవ్ స్టోరీతో ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక మెగా కుటంబం నుంచి నాగబాబు కూతురు నిహారికతో ‘ఒక మనసు’ మూవీలో కలిసి నటించినా ఆ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ నటనా పరంగా శౌర్యకు మంచి పేరు తీసుకొచ్చింది. తాజాగా హీరో నాగశౌర్య ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. తన ఫౌమ్‌హౌస్ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న అడ్డుకోకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

నగర శివారులోని రాజేంద్రనగర్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరాలపై ఆదివారం సాయంత్రం ఎస్వోటీ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు బృందాలుగా వెళ్లిన పోలీసులను రాకను ముందే గమనించిన పేకాట రాయుళ్లు ఎక్కడికక్కడ పారిపోయారు. అయితే, ఈ దాడులు ఒక ఫామ్ హౌస్‌లో జరగగా.. అది హీరో నాగశౌర్యది అని తేలింది. ఈ దాడుల్లో 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, అందులో పలువురు ప్రముఖులు ఉన్నారు. ప్రముఖులు ఉన పోలీసులు తెలిపారు. వీరి నుంచి రూ.6లక్షల నగదు, 20కు పైగా కార్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

అయితే, నాగ శౌర్య ఈ ఫామ్ హౌస్‌ను ఐదేళ్ల పాటు లీజుకు తీసుకున్నాడని పోలీసులు తేల్చారు. కెరీర్ మంచి రైజింగ్ దశలో ఉన్నప్పుడు ఇలాంటి క్రైంలల్లో ఇరుక్కుంటే సినీ అవకాశాలు కూడా తగ్గిపోయే చాన్స్ ఉంటుంది. ఈ ఘటన గురించి తెలియగానే సినీ పరిశ్రమలో అందరూ షాక్ అయినట్టు తెలిసంది. ప్రస్తుతం నాగశౌర్య వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండగా, ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు తన ఫామ్ హౌజ్ నిలయం కావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *