Breaking News

హీరోయిన్ రాశికి ఆర్థిక ఇబ్బందులు.. ఆమె ఏం చెబుతుందంటే..?

రాశి.. తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు ఈ పేరు చాలా మారుమోగిపోయింది. ఒకానొక సందర్భంగా ఆమెకు మూవీ ఆఫర్లు వరసగా రావడంతో చాలా బిజీ అయిపోయింది. అయితే రావుగారి ఇల్లు మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది రాశి. ఆ మూవీలో ఆమె నటనకు మంచి ఆదరణ లభించింది. చాలా మందిని అట్రాక్ట్ చేసింది కూడా. అప్పటి వరకు చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్న ఆమె.. తర్వాత పవన్ కళ్యాణ్‌తో కలిసి గోకులంలో సీత మూవీలో యాక్ట్ చేసి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో చాలా మంది మన్ననలు పొందింది. ఎంతో మంది ఫ్యాన్స్‌ను సైతం సంపాదించుకుంది. ఆ తర్వాత భారీగా మూవీ ఆఫర్స్ వచ్చాయి. స్టార్ హీరోలతో వరుసగా మూవీస్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. అనంతరం మహేశ్ బాబు యాక్ట్ చేసిన నిజం మూవీలో వ్యాంప్ క్యారెక్టర్‌లో యాక్ట్ చేసింది. ఇండస్ట్రీలో మంచి పేరును, గుర్తింపును సంపాదించుకుని మ్యారేజ్ చేసుకుంది. మ్యారేజ్ తర్వాత కొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత కల్యాణ వైభోగం అనే మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసింది.

ఇదిలా ఉండగా కొన్ని రోజుల నుంచి రాశికి సంబంధించి కొన్ని రూమర్స్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆమెకు సినీ ఇండస్ట్రీలో చాన్స్‌లు రావడం లేదని, దీని వల్ల ఆమెకు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చాలా వార్తలు వస్తున్నాయి. ఈ విషయం రాశి వద్దకు చేరుకోవడంతో ఆమె ఆ రూమర్స్‌పై స్పందించింది. తన స్టైల్‌లో వాటికి చెక్ పెట్టింది. తన పర్సనల్ లైఫ్‌పై సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయని అందులో వాస్తవం లేదంటూ కొట్టిపారేసింది. తన ఫ్యామిలీతో తాను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. అందరు వారి వారి లైఫ్‌లో ఒడిదుడుకులు ఎదుర్కోవడం సాధారణమేనని తెలిపింది. వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించింది. ఇక రాశి ప్రస్తుతం పలు టీవీ సీరియల్స్‌లో యాక్ట్ చేస్తూ ఎంతో బిజీగా ఉంది. చాలా మంది టీవీ ఆడియన్స్‌ను సైతం తన యాక్టింగ్‌తో అట్రాక్ట్ చేస్తోంది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *