Breaking News

స‌మంత ఆ విష‌యంలో ఫెయిల్ అంటున్న అమ‌ల‌..!

ఇప్పుడు టాలీవుడ్‌లో నాగ‌చైత‌న్య, స‌మంత టాపిక్‌లు ఎంత పాపుల‌ర్ అవుతున్నాయో అంద‌రికీ తెలిసిందే. అయితే వీరి గురించి ఏ చిన్న వార్త అయినా లేదంటే ఏ ఒక్క సెల‌బ్రిటీ స్పందించినా ఇట్టే వైర‌ల్ అయిపోతున్నాయి. ఇప్ప‌టికే ఎన్నో ర‌కాల పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. కాగా రీసెంట్ గా స‌మంత త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన సైక్లింగ్ సెషన్ వీడియో బాగానే పాపుల‌ర్ అయింది. కాగా ఇందులో ఆమె ఒక క్యాప్ష‌న్ కూడా ఇచ్చారు. అదేంటంటే బెస్ట్ ఫ్రెండ్స్‌తో గ‌డిపే స‌మ‌యం మ‌ధుర‌మైంది అంటూ రాసుకొచ్చారు.

ఇక వ‌ర్షంలో త‌డుస్తూ కూడా సైక్లింగ్ చేస్తున్న వీడియోలో తాను మొద‌టి రోజు 21కిలోమీట‌ర్ల గ‌మ్యం చేరుకున్నాన‌ని, ఈ స‌మంయ‌లో కూడా 100 కిలోమీట‌ర్ల గ‌మ్యం చేరుకుంటానంటూ చెప్పింది. ఇక ల‌వ్ స్టోరీ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో ఎక్క‌డా స‌మంత క‌నిపించ‌లేదు. అలాగే ఆ త‌ర్వాత అక్కినేని కుటుంబం నిర్వహించిన విందులో కూడా స‌మంత లేక‌పోవ‌డంతో ఈ వార్త‌ల‌కు మ‌రింత బ‌లం చేకూరింది. ఈ త‌రుణంలోనే ఇప్పుడు స‌మంత గురించి మ‌రో వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అక్కినేని అమ‌ల స‌మంత గురించి ఓ సీక్రెట్ బ‌య‌ట‌పెట్టింది.

రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న అమ‌ల త‌న ఫ్యామిలీ గురించి చెప్పుకొచ్చింది. అయితే త‌న‌కు వంట రాద‌ని, కాక‌పోతే నాగార్జున మాత్రం బాగా వంట చేస్తారంటూ చెప్పుకొచ్చింది. ఇక త‌న కోడ‌లు స‌మంత‌కు కూడా వంట రాద‌ని, కాక‌పోతే నాగార్జున లాగే చైతూ కూడా బాగా వంట చేస్తాడ‌ని, వారిద్ద‌రూ బెస్ట్ కుక్ అనే బిరుదు కూడా ఇచ్చేసింది. అంటే స‌మంత‌కు ఉన్న లోపాన్ని బ‌య‌ట పెట్టేసింద‌న్నమాట‌. ఇక ఈ ఇంట‌ర్వ్యూలో త‌న ఇంట్లో నాగార్జున ఎక్కువ‌గా వంట చేస్తుంటార‌ని, ఇక చైత‌న్య‌, స‌మంత ఇంట్లో కూడా చైతూనే వంట చేస్తారంటూ న‌వ్వేస్తుంది అమ‌ల‌. ఇలా స‌మంత‌కు సంబంధించిన లోపాన్ని ఆమె చెప్పేసింద‌న్న‌మాట‌. ఈ వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా పాపుల‌ర్ అవుతోంది. అయితే త్వ‌ర‌లోనే వీరి వివాహ బంధంపై మ‌రింత క్లారిటీ వ‌స్తుంద‌ని అంద‌రూ ఎంతో ఎదురుచూస్తున్నారు. ఏమ‌వుతుందో చూడాలి మ‌రి.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *