Breaking News

స్టార్ హీరోయిన్ మీరా జాస్మిన్‌ను ఆ సినీ ఇండస్ట్రీ ఎందుకు నిషేధించిందంటే?

సినీ ఇండస్ట్రీలో నటీనటులు ఏదేని తప్పులు చేసే ఆ పరిశ్రమ వారాని నిషేధిస్తుంటుంది. అయితే, ఈ బ్యాన్ కొంత కాలం పాటు కొనసాగొచ్చు. లేదా జీవితం కాలం కూడా కొనసాగొచ్చు. తప్పులను ఒప్పుకుని క్షమాపణలు చెప్తే బ్యాన్ ఎత్తేసే చాన్సెస్ ఉంటాయి. కాగా, స్టార్ హీరోయిన్ పొజిషన్ అతి తక్కువ కాలంలోనే పొందిన స్టార్ హీరోయిన్ మీరా జాస్మిన్‌ను మాలీవుడ్ (మలయాళం) ఇండస్ట్రీ బ్యాన్ చేసిందట. ఎందుకో తెలియాలంటే మీరు ఈ స్టోరిని ఫుల్లీ రీడ్ చేయాల్సిందే.

ముద్దుగుమ్మ మీరా జాస్మిన్ తన అందంతో పాటు నటనతో తెలుగు, తమిళ్, మలయాళ ప్రేక్షకులను మెప్పించింది. టాలీవుడ్‌లో సూపర్ హిట్ ఫిల్మ్స్‌లో నటించి తనకంటూ స్పెషల్ రికగ్నిషన్ తెచ్చుకుంది ఈ హీరోయిన్. మాస్ మహారాజ రవితేజ ‘భద్ర’, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘గుడుంబా శంకర్’, ‘అమ్మాయి బాగుంది, గోరింటాకు’ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మీరా జాస్మిన్. ‘గోరింటాకు’ చిత్రంలో రాజశేఖర్ చెల్లెలుగా కనిపించి ఆ పాత్రలో సహజంగా నటించింది. ఈ క్రమంలోనే తెలుగు ఇంటి ఆడపడుచులకు మీరా జాస్మిన్ బాగా దగ్గరైపోయింది. అన్నా చెల్లెలి అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఆ చిత్రం ద్వారా మీరా జాస్మిన్‌కు మంచి గుర్తింపు లభించింది.

ఇకపోతే మ్యారేజ్ తర్వాత మీరా వెండితెరపైన కనిపించలేదు. అయితే, మ్యారేజ్ తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని మీరా జాస్మిన్ పేర్కొంది. కానీ, సినిమాల్లో కనిపించలేదు. ఇకపోతే తన భర్తతో విభేదాల వల్ల ప్రస్తుతం సెపరేట్‌గా జీవిస్తోంది మీరా జాస్మిన్. మంచి రోల్ లభిస్తే మీరా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్టింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. మీరా జాస్మిన్ స్టార్ హీరోయిన్‌గా ఉన్న సమయంలో తెలుగు, తమిళ్‌తో పాటు మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో మంచి అవకాశాలే లభించాయి. అయితే, మాలీవుడ్ (మలయాళం) డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్‌తో మీరా జాస్మిన్ పొగరుగా మాట్లాడిందని తెలుస్తోంది. మలయాళ దర్శకులు, నిర్మాతలకు వ్యతిరేకంగా ఎన్నోసార్లు మాట్లాడిందన్న కారణంగా మలయాళ పరిశ్రమ మీరాజాస్మిన్‌ను బ్యాన్ చేసిందట. దాంతో మాలీవుడ్ సినిమాల్లో మీరా ఇక నటించే చాన్సెస్ లేవు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *