Breaking News

సిరి, షణ్ముఖ్ మధ్య ఆ పని.. కావాలనే చేస్తున్నారా?

షణ్ముఖ్, సిరి హన్మంతు.. బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న కంటెస్టెంట్లు. వీరిద్దరు కలిసి సక్సెస్ ఫుల్ గా గేమ్ ఆడుతున్నారు. అయితే వీరిద్దరి ఆట తీరుపై తోటి కంటెస్టెంట్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇద్దరు కలసి ఒక్కటిగా ఆడుతూ సేఫ్ గా ఉంటున్నారనేది ఆ విమర్శల సారాంశం. ఇప్పటి వరకు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ముగ్గురు కంటెస్టెంట్లు కూడా వీరి గురించి తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శల్లో వాస్తవం ఎంత? అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం..

తొలివారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సరయు వీరి గురించి సీరియస్ కామెంట్స్ చేసింది. సిరి, షణ్ముఖ్ అనుకుని గేమ్ ఆడుతున్నారని చెప్పింది. అమ్మాయిలను అడ్డం పెట్టుకుని ఆడటం ఏంటని నిలదీసింది కూడా. కావాలంటే చేతులకు గాజులు వేసుకోవాలని సీరియస్ కామెంట్స్ చేసింది. రెండో వారం ఎలిమినేట్ అయిన ఉమాదేవి కూడా వీరి ఆట గురించి ప్రత్యేకంగా మాట్లాడింది. ఎవరి గేమ్ వారు ఆడాలని చెప్పింది. ఇద్దరు కలిసి ఇతరులతో ఆడుకోవద్దని చెప్పింది. ఉమా వ్యాఖ్యలతో ఈ అనుమానం మరింత బలపడింది. అటు తాను సిరికి దూరంగా ఉంటానని జెస్సీకి చెప్పాడు. దూరంగా ఉండేందుకు ప్రయత్నించాడు కూడా. అయితే తనతో ఎందుకు మాట్లాడ్డం లేదంటూ సిరి కన్నీరు పెట్టుకుంది. అటు సిరిని ఎందుకు ఏడిపిస్తున్నావ్? అంటూ నాగార్జున షణ్ముఖ్ ను అడిగాడు. దీంతో మళ్లీ ఇద్దరు కలిసిపోవాలనుకున్నారు. తాజాగా ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు కూడా.

తాజాగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన లహరి కూడా వీరి గురించి కామెంట్స్ చేసింది. సిరి వేసిందనే షణ్ముఖ్ కూడా తనను నామినేట్ చేశాడని చెప్పింది. ఈ కామెంట్స్ వీరిద్దు కలిసే గేమ్ ఆడుతున్నారనేది అర్థం అయ్యింది. ఇంట్లో ఉన్న ముగ్గురు వీరి గురించి ఒకేరకమైన కామెంట్స్ చేయడంతో నిజమే అనే అనుమానం కలుగుతుంది. ఇప్పటికే దీప్తి సునయన, షణ్ముఖ్ చాలా క్లోజ్ ఉంటారు. కాబట్టి సిరితో తను జస్ట్ స్నేహం మాత్రమే ఉంటుంది అని మరికొందరు అనుకుంటున్నారు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *