Breaking News

సినీ ఇండస్ట్రీలో విషాదం… ప్రముఖ యాక్టర్ కన్నుమూత

సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ యాక్టర్ రాజబాబు కన్నుమూశారు. కొంత కాలంగా హెల్త్ ప్రాబ్లమ్స్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయన నిన్న రాత్రి (ఆదివారం) మృతి చెందారు. పలు సినిమాల్లో, సీరియల్స్‌లో ఆయన నటించారు. ఆయన రంగస్థల నటుడు కూడా. అతన్ని ఇండస్ట్రీలో అందరూ బాబాయ్ అని ప్రేమగా పిలుస్తుంటారు. స్ర్కీన్ పైన కాస్త కఠినంగా కనిపించే రాజబాబు.. రియల్ లైఫ్‌లో చాలా సదరా మనిషి. అందరితో సరదగా ఉంటూ నవ్విస్తూ ఉంటారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలంలోని నరసాపురపేటలో 1957లో ఆయన జన్మించారు. ఆయన తండ్రి రామతారకం సైతం ఇండస్ట్రీకి చెందిన వాడే. ఆయన పలు చిత్రాలను నిర్మించాడు, నటించారు కూడా.

రాజబాబుకు కబడ్డీ ఆడటం, వ్యవసాయం చేయడం అంటే చాలా ఇష్టం. నటుడిగా ఆయన ఎందరితోనే శభాష్ అనిపించుకున్నారు. ఓ వైపు నాటకాలు వేస్తూనే సినిమాల్లోకి వచ్చారు. ఊరికి మోనగాడు అనే సినిమాతో 1995లో ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అనంతరం సింధూరం మూవీలో ఆయన కీ రోల్‌లో నటించారు. అప్పటి నుంచి ఆయనకు చాన్స్‌లు ఎక్కువగా వచ్చాయి. సినిమా ఆఫర్స్ ఎక్కువగా రావడంతో ఆయన కాకినాడ నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యారు.

మురారి, సీతమ్మవాకిట్టో సిరిమల్లె చెట్టు, భరత్ అనే నేను, శ్రీకారం వంటి సినిమాల్లో సైతం యాక్ట్ చేశారు. 62 మూవీస్ లో నటించిన ఆయన.. మంచి క్యారెక్టర్ రోల్స్ చేశారు. అనంతరం టీవీల్లోని పలు సీరియల్స్ లోనూ ఆయన యాక్ట్ చేశారు. అభిషేకం, బంగారు పంజరం, ప్రియాంక, చిలసౌ స్రవంతి, మనసు మమత తదితర సీరియల్స్‌లో ఆయన ఇంపార్టెంట్ రోల్స్‌లో నటించి టీవీ ఆడియన్స్‌ను మెప్పించారు. ఇక 2005లో అమ్మ సీరియల్ లో ఆయన పాత్రకు నంది అవార్డు వచ్చింది. ఇవే కాకుండా ఆయన మరెన్నో సీరియల్స్ లో నటించి అందరి మన్ననలు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన మరణం వార్త విని సినీ ఇండస్ట్రీ దిగ్ర్భాంతి వ్యక్తి చేసింది. పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *