Breaking News

సినిమా ఛాన్స్ ఇవ్వడానికి వెళ్తే హంతకుడు అని బెదరగొట్టిన హీరోయిన్ రాధికా

రాధిక.. తెలుగు జనాలకు పరిచయం అక్కర్లేని పేరు. అభిలాష, రాధా కల్యాణం, స్వాతిముత్యం, లాయర్ భారతీదేవి, పట్నం వచ్చిన ప్రతివ్రతలు, దొంగ మొగుడు, స్వాతి కిరణం అద్భుత సినిమాల్లో అద్భుత పాత్రలు పోషించింది ఈ అందాల తార. సుమారు మూడు దశాబ్దాల పాటు తెలుగు, తమిళ సినిమాల్లో సత్తా చూటుతూ ముందుకు వెళ్తోంది. ముఖంలో చిరునవ్వు చిందించే ఈ అమ్మడు.. ఇప్పటికీ తన నటనలో ఎలాంటి జోష్ తగ్గలేదంటోంది.

1977లో తమిళ సినిమా పరిశ్రమలో దర్శకుడిగా అడుగు పెట్టాడు భారతీరాజా. ఆయన శ్రీదేవితో కలిసి పదహారేళ్ల వయసు సినిమా తీసి ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. అదే ఊపులో రెండు సినిమా కథ రాసుకున్నాడు. ఈ సినిమాను కొత్త వారితో తెరకెక్కించాలి అనుకున్నాడు. అప్పుడే తనకు కనిపించింది రాధిక. వెంటనే తన ఇంటికి వెళ్లాడు. అదే సమయంలో రాధిక గార్డెన్ లో చెట్లకు నీళ్లు పోస్తుంది. ఎవరో ఆగంతకుడు ఇంట్లోకి వచ్చాడు అనుకుంది. అంతకు ముందు రోజే ఆ వీధిలో ఓ మర్డర్ జరిగింది. దీంతో భయంతో కేకలు వేసింది రాధిక. వెంటనే ఇంట్లో వాళ్లంతా అక్కడికి వచ్చాడు. తాను సినిమా దర్శకుడిని అని చెప్పుకునేందుకు భారతీ రాజా నానా ఇబ్బందులు పడ్డాడు.

చివరకు తాను వచ్చిన సంగతి ఏంటో చెప్పాడు. సినిమాలో రాధికకు అవకాశం ఇవ్వడానికి వచ్చినట్లు చెప్పాడు. ఈ మాట విన్న రాధిక చాలా నవ్వుకుంది. తనను సినిమా తెరపై ఎవరు చూస్తారంటూ కామెంట్ చేసింది. ఆ తర్వాత భారతీ రాజాకు తెలిసిన విషయం ఏంటంటే.. రాధిక మరెవరో కాదు.. ఎమ్మార్ రాధ కూతురు. తను తమిళ సినిమాల్లో గ్రేట్ విలన్. ముక్కోపి. తనకు కోపం రావడంతో అప్పటి తమిళ సూపర్ స్టార్ ఎంజీఆర్ మీదనే కాల్పులు జరిపింది. అందుకే తన పిల్లలను ఇక్కడ ఉండకుండా దూరంగా చదివించింది. చిరకు తన సినిమాలో నటించేందుకు రాధికను ఒప్పించాడు. ఈ సినిమా పేరు తూర్పు వెళ్లే రైలు. అదే సమయంలో ఈ సినిమాలో భాగం పంచుకున్న భాగ్యరాజాతో అస్సలు పడేది కాదు. కానీ ఆ తర్వాత ఇద్దరు మంచి మిత్రులు అయ్యారు. ఆయన దర్శకుడు అయ్యాక ఆమెతో పలు సినిమాలు చేశాడు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *