Breaking News

సినిమాకు ముందే బడ్జెట్ మొత్తం ఖర్చు చేసిన వెంకటేష్ సినిమా.. మాములు ట్విస్ట్ కాదు

తమిళంలో మంచి హిట్ అయిన సినిమా సుందరకాండ. ఈ సినిమా అక్కడ జనాలకు విపరీతంగా నచ్చింది. మంచి జనాదరణ దక్కించుకుంది. తమిళంలో ఈ సినిమాలో హీరోగా భాగ్యారాజా నటించాడు. ఈ సినిమా కోలీవుడ్ లో హిట్ కావడంతో దాని తెలుగు డబ్బింగ్ రైట్స్ తీసుకున్నాడు నిర్మాత కెవివి సత్యనారాయణ. ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు రామానాయుడు స్టూడియోలో జరిగాయి. ఆ సమయంలో వెంకటేష్ ఈ సినిమాను చూశాడు. అప్పటికే వెంకటేష్ హీరోగా మంచి స్వింగ్ లో ఉన్నాడు బొబ్బిలి రాజా, చంటి లాంటి సూపర్ హిట్స్ సాధించాడు. ఆ సమయంలో ఈ సినిమా తనకు బాగా నచ్చింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందని నిర్మాతకు చెప్పాడు.

అటు ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ అప్పటికే పూర్తి అయ్యింది. అన్ని ఏరియాల్లో బిజినెస్ కూడా క్లోజ్ అయ్యింది. అయినా వెంకటేష్ ఈ సినిమా చేస్తానని చెప్పడంతో బయ్యర్లను ఒప్పించాడు. వాళ్లు ఇచ్చిన డబ్బుకు రెట్టింపు డబ్బు ఇచ్చి.. డబ్బింగ్ మూవీని వెనక్కి తీసుకున్నాడు. ఇదే సమయంలో నిర్మాతకు మరో సమస్య వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి ఆయన కేవలం డబ్బింగ్ రైట్స్ మాత్రమే తీసుకున్నాడు. రీమేక్ కోసం తీసుకోలేదు. అయితే ఈ సినిమా రీమేక్ రైట్స్ ఇవ్వాలంటే మరో 50 లక్షలు ఇవ్వాలని తమిళ సినిమా వారు డిమాండ్ చేశారు. చివరకు 25 లక్షలు ఇచ్చి రైట్స్ తీసుకున్నారు.

మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా మొదలు పెట్టడానికి ముందే నిర్మాత కెవివి సత్యనారాయణకు భారీగా ఖర్చు వచ్చింది. డబ్బింగ్‌ వెర్షన్‌కు 10 లక్షలు, బయ్యర్లకు 10 లక్షలు, రీమేక్‌ రైట్స్‌ కు 25 లక్షలు ఖర్చు అయ్యాయి. సినిమా మొదలు కాకముందే 45 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. అయితే సుందరకాండ సినిమా అనుకున్న దానికంటే మంచి విజయం సాధించింది. దీంతో సత్యనారాయణకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కలగలేదు. దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన సినిమాలో మీనతో పాటు అపర్ణ హీరోయిన్లుగా నటించారు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *