Breaking News

సిద్ధార్థ్ మొదటి భార్య గురించి ఎవరికి తెలియని విషయాలు .. అతడి కొడుకు వయసు తెలిస్తే నమ్మరు !

సినీ హీరో సిద్ధార్థ్‌ను యూత్ ఎప్పటికీ మర్చిపోలేదు. ఎందుకంటే బొమ్మరిల్లు సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్ అలాంటింది. 2006 లో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌లో మంచి పేరును సంపాదించుకుంది. ఇందులో సిద్ధార్థ్ తన క్యారెక్టర్‌కి వంద శాతం న్యాయం చేశాడనే చెప్పాలి. ఇక తండ్రి పాత్రలో ప్రకాశ్‌రాజ్ జీవించారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో సిద్ధార్థ్, ప్రకాశ్‌రాజ్ మధ్య వచ్చే సీన్ మూవీకే హైలెట్ అని చెప్పాలి. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ప్రతి కుటుంబంలో బొమ్మరిల్లు డైలాగ్ ఫేమస్ అయింది. ‘మా డాడీ బొమ్మరిల్లు ఫాదర్’ అనే డైలాగులు చాలా మంది నోటి నుంచి వచ్చాయి. ఈ సినిమాలో చూపించిన క్యారెక్టర్స్ ప్రతి ఇంట్లోనూ దాదాపుగా ఇలానే ఉంటాయి. ఈ మూవీ తర్వాత సిద్ధార్థ్ నటించిన ఓయ్, ఓ మై ఫ్రెండ్ సినిమాలు సైతం మంచి పేరును తెచ్చుకున్నాయి. మూవీస్ పరంగా సిద్ధార్థ్ మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ.. పర్సనల్ లైఫ్‌కు సంబంధించి కొన్ని విమర్శలు ఆయనకు ఎదురయ్యాయి. ఆయనకు పెండ్లి అయిందనే విషయం చాలా మందికి తెలియదు. ఎందుకంటే పెండ్లి చేసుకున్న కొద్ది రోజులకే వారు విడిపోవడంతో ఈ విషయం ఎక్కువగా బయటకు రాలేదు. అందులోనూ వారిద్దరిదీ లవ్ మ్యారేజ్ కావడం విశేషం.

2003లో వారి పొరుగింటి లో ఉండే మేఘన అనే యువతిని సిద్ధార్థ్ లవ్ చేసి 2003 లో పెండ్లి చేసుకున్నాడు. కానీ వీరు ఎక్కువ కాలం కలిసుండలేకపోయారు. కొద్ది రోజులకే వీరి మధ్య విభేదాలు, మనస్పర్థలు రావడంతో 2007‌లో వీరి వివాహబంధానికి ఇద్దరూ స్వస్తి పలికారు. అప్పటికే వీరికి ఓ బాబు పుట్టాడు. వీరు విడిపోయిన అనంతరం ఆ బాబు మేఘన వద్దే ఉంటున్నాడు.

ఇక హీరో సిద్ధార్థ్ కొడుక్కి ప్రస్తుతం 17 వయసు ఉంటుంది ప్లస్ 2 చదువుతున్న అతడు తండ్రి బాటలోనే సినిమాల్లో వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నాయి

అప్పటి నుంచి సిద్ధా్ర్థ్ తిరిగి మరో మ్యారేజ్ చేసుకోలేదు. ఓ టాప్ హీరోయిన్‌తో సిద్ధార్థ్ లవ్ ట్రాక్ నడిపాడనే వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి. తెలుగు మూవీస్‌లో నటించిన సిద్ధార్థ్ చాలా గ్యాప్ తర్వాత ప్రస్తుతం శర్వానంద్‌తో కలిసి ఆయన నటించిన మహా సముద్రం మూవీలో నటించారు. ఈ మూవీ ఇటీవలే రిలీజ్ అయి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *