Breaking News

సింహరాశిలో ఐటమ్ సాంగ్ చేసిన ఈ నటి గుర్తుకు ఉందా..??

ఇక చిత్ర విచిత్రమైన సినిమా ఇండస్ట్రీ లో అదృష్టం లేకపోతె నిలదొక్కుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక్కోసారి నటీమణులు వచ్చి రావడంతోనే బాగా ఆకట్టుకున్నారు. ఇక కొద్దిరోజులకే అనుకుండా వారు ఇండస్ట్రీకి దూరమైపోతున్నారు. అంతేకాక.. ఇండస్ట్రీ నుండి దూరమైన కొంత మంది నటులు రాజకీయాలవైపు అడుగులు వేస్తున్నారు.

ఇక అందులో ప్రముఖ దర్శకుడు వి.సముద్ర స్టార్ హీరో రాజశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా సింహరాశి. ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ బ్యూటీ వింధ్య. ఈ భామ కూడా ఆ కోవకే చెందింది. ఇక వింధ్య తమిళ్ ఇండస్ట్రీలో సంఘం సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఇక వింధ్య తెలుగు, తమిళం, మలయాళం తదితర భాషల్లో దాదాపు 20 చిత్రాల్లో నటించినప్పటికీ ఆమె ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించలేకపోయింది.

ఆమె రాజశేఖర్ హీరోగా నటించిన సింహరాశి మూవీలో స్పెషల్ సాంగ్ తో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైయ్యారు. ఇక నందమూరి హరికృష్ణ, సౌందర్య, సిమ్రాన్ నటించిన సినిమా సీతయ్య. ఈ సినిమాకి వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలో ఓ పాత్రలో వింధ్య నటించారు. కాగా.. వింధ్య సినిమాలు కల్సి రాలేదంట. అంతేకాక కథల ఎంపిక కావచ్చు, మరొకటి కావచ్చు మొత్తం మీద ఇండస్ట్రీకి దూరమైంది ఈ భామ.

ఇక కొన్నాళ్ళు తమిళ రాజకీయాల్లో కూడా పని చేసింది వింధ్య. ఆమె అన్నా డీఎంకేలో చేరిన సంగతి అందరికి తెలిసిందే. అయితే తమిళ నాట అమ్మగా పేరొందిన దివంగత సీఎం జయలలిత మరణంతో రాజకీయాలకు కూడా దూరంగా ఉంటున్న వింధ్య రాజకీయాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా అన్నా డీఎంకే లో కార్యదర్శి పదవిని వాదించారు. దీంతో సినిమాలకు పూర్తిగా దూరమై రాజకీయాల్లో కొనసాగుతోంది ఈ భామ.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *