Breaking News

సాయి పల్లవి లేకుండా ఈ 8 చిత్రాలను అసలు ఊహించలేము.. మైండ్ బ్లోయింగ్ రోల్స్

సినిమా వరల్డ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది గ్లామర్.. అటువంటి గ్లామర్ ఫీల్డ్‌లో సహజత్వానికే ప్రయారిటీ ఇస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మలయాళ ముద్దుగుమ్మ సాయిపల్లవి. సహజనటిగా దక్షిణ భారతదేశంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ భామ. వెండి తెరమీద ప్రతీ ఒక్క యంగ్ హీరోయిన్ గ్లామర్ రోల్స్ ప్లే చేస్తుండగా, తాను మాత్రం డిఫరెంట్‌గా సహజత్వానికి ఇంపార్టెన్స్ ఇస్తూ రాణిస్తోంది. అందాల ఆరబోత అవసరం లేకుండా సహజసిద్ధమైన నటన, డ్యాన్స్‌తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి ప్రజెంట్ టాప్ హీరోయిన్‌గా ఉంది. ఇక ఈ సంగతులు అలా ఉంచితే అదే డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లవ్ స్టోరి’ సినిమా శుక్రవారం విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ క్రమంలోనే సాయి పల్లవి తన కెరీర్‌లో పోషించిన ఎనిమిది అత్యద్భుతమైన పాత్రలపై స్పెషల్ స్టోరి.

ప్రేమమ్ : నివిన్ పాలీ హీరోగా వచ్చిన ఈ మలయాళ ఫిల్మ్ సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో సాయిపల్లవి ‘మలార్’ పాత్రలో యంగ్ టీచర్‌గా కనిపించింది. మూవీలో హీరోగా డ్యాన్స్ నేర్పించే సీన్స్ చూసి కుర్రకారు ఫిదా అయిపోయారు. ఈ మూవీ ద్వారా సాయిపల్లవి పేరు దక్షిణ భారతదేశం అంతటా వ్యాప్తి చెందింది. ‘ప్రేమమ్’ సినిమాను తెలుగులోనూ రీమేక్ చేశారు. నాగచైతన్య హీరోగా వచ్చిన తెలుగు ‘ప్రేమమ్’ సినిమాలో సాయిపల్లవి పాత్రలో శ్రుతి హాసన్ నటించింది.

కాళి : మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తనయడు దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన మలయాళ సినిమా ‘కాళి’లో హీరోయిన్‌గా నటించింది సాయిపల్లవి. ఈ చిత్రం తెలుగులో ‘హేయ్ పిల్లగాడ’ టైటిల్‌తో విడుదలైంది. ఈ మూవీలో సాయిపల్లవి నటనకుగాను మంచి మార్కులే పడ్డాయి. విపరీతమైన కోపం ఉన్న హస్బెండ్‌కు వైఫ్‌గా సాయిపల్లవి కనిపించింది. ఈ చిత్రంలో ‘అంజలి’ పాత్ర ద్వారా సాయిపల్లవి తన నటనా ప్రతిభను చూపించింది.

ఫిదా : ‘ఫిదా’ చిత్రం ద్వారా సాయిపల్లవి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ‘భానుమతి’గా సినిమాలో సాయిపల్లవి పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ అని ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. చిత్రంలో అల్లరి పిల్లగా సాయిపల్లవి నటన, ‘వచ్చిండే‌’ సాంగ్‌కు నెమలి వలె సాయిపల్లవి డ్యాన్స్‌కు కుర్రకారు, తెలుగు ప్రేక్షకలోకం ఫిదా అయింది. ఇక ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్‌గా సాయిపల్లవి కనిపించడం విశేషం. ఈ చిత్రంలో సాయిపల్లవి నటనను మెచ్చే శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరి’ సినిమాలోనూ హీరోయిన్‌గా ఫిక్స్ చేశారని సమాచారం.

మిడిల్ క్లాస్ అబ్బాయి : వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ఈ చిత్రంలో సాయిపల్లవి సూపర్ క్యూట్ పాత్రను పోషించింది. ఇకపోతే నాని, సాయిపల్లవి మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయింది. చిత్రంలో ‘చిన్ని’ పాత్రలో పల్లవి ప్రేక్షకుల మెప్పు పొందింది. సీనియర్ హీరోయిన్ భూమిక సిస్టర్‌గా సాయిపల్లవి ఈ చిత్రంలో అద్భుతంగా నటించి జనం ఆదరణ పొందింది.

కణం : ‘తలైవి’ ఫేమ్ డైరెక్టర్ ఏ.ఎల్.విజయ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ ‘కణం’ చిత్రంలో సాయిపల్లవి అబార్షన్‌కు గురైన మహిళగా నటించింది. కెరీర్ స్టార్టింగ్‌లోనే ఇటువంటి ఎక్స్‌పరిమెంటల్ రోల్ చేసి ప్రశంసలు పొందింది పల్లవి. ఈ మూవీలో పల్లవి నటనకు పూర్తిగా స్కోప్ ఉండగా, అత్యద్భుతంగా నటించింది. నాగశౌర్య ఈ సినిమాలో హీరో అయినప్పటికీ హీరో కంటే కూడా హీరోయిన్ సాయిపల్లవి పర్ఫార్మెన్స్‌కే మంచి మార్కులు పడ్డాయి.

పడిపడి లేచే మనసు : యంగ్ హీరో శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రంలో డాక్టర్‌గా నటించింది. మెమొరీ లాస్ పేషెంట్‌గా, ప్రేమికురాలిగా సాయిపల్లవి అత్యద్భుతంగా నటించింది. హను రాఘవపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఈ భావోద్వేగాల సమాహారమైన ప్రేమ కథలో సాయిపల్లవి చక్కగా నటించింది. ఊహించని మలుపులతో సాగే ఈ లవ్ డ్రామాలో సాయిపల్లవి బాగా నటించింది.

మారి 2 : తమిళ్ యంగ్ హీరో ధనుష్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘మారి’కి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రంలో సాయి పల్లవి మాస్ రోల్ ప్లే చేసింది. ఆటో డ్రెవర్‌గా కనిపించి ప్రేక్షకులను అలరించింది. తన సహజ నటన, యాటిట్యూడ్‌తో సినిమాను పల్లవి నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లిందని చెప్పొచ్చు. ఇక ప్రభుదేవా కొరియోగ్రఫీలో ‘రౌడీ బేబీ’ సాంగ్‌లో ఎక్సలెంట్ స్టెప్స్ వేసి ఫ్యాన్స్, ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది.

పావ కధైగళ్: తమిళ్ ఆంథాలజీ ‘పావ కథైగళ్’లో వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ‘ఊర్ ఇరవు’ పార్ట్‌లో సాయిపల్లవి నటించింది. గర్భిణి పాత్రలో చక్కగా నటించడంతో పాటు ఎమోషనల్ సీన్స్ ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది. ఓటీటీలో విడుదలైన ఈ ఆంథాలజీ పార్ట్‌లో సాయిపల్లవి పాత్ర చనిపోవడం చూస్తే ప్రతీ ఒక్కరు కంటతడి పెట్టుకుంటారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

లవ్ స్టోరి : సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘లవ్ స్టోరి’లో నాగచైతన్య సరసన సాయిపల్లవి నటించింది. ‘ఫిదా’తో పోల్చితే ఈ సినిమాలో సాయిపల్లవి పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ తెలిపారు. సాయిపల్లవి పాత్ర ద్వారానే ఈ ఫిల్మ్‌లో బలమైన, సున్నితమైన అంశాలను ప్రస్తావించనున్నట్లు డైరెక్టర్ శేఖర్ కమ్ముల పేర్కొన్నారు.

పల్లవి అప్ కమింగ్ మూవీస్ : ‘లవ్ స్టోరి’ సినిమాతో పాటు సాయి పల్లవి రానా దగ్గుబాటి ‘విరాట పర్వం’ చిత్రంలో నటించింది. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నక్సలిజం బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్నది. ఈ చిత్రంలో వెరీ పవర్ ఫుల్ రోల్‌ను సాయిపల్లవి ప్లే చేసిందని సమాచారం. నేచురల్ స్టార్ నాని-రాహుల్ సాంకృత్యన్ కాంబోలో వస్తున్న‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలోనూ సాయిపల్లవి ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *