Breaking News

సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీ రివ్యూ.. రోధిస్తున్న అభిమానులు

సాయి ధరమ్ తేజ్ హీరోగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ తెరకెక్కిన తాజా సినిమా రిపబ్లిక్. రమ్యక్రిష్ణ, జగపతి బాబు సహా పలువురు నటించిన ఈ సినిమాను దర్శకుడు దేవా కట్టా రూపొందించాడు. ఈ సినిమా ఇవాళ విడుదల అయ్యింది. మొత్తంగా ఈ సినిమా కథ ఏంటి? ఎలా ఉంది? జనాలు ఏం అనుకుంటున్నారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

పంజా అభిరామ్ (సాయి ధరమ్ తేజ్) ఇంటెలిజెంట్ స్టూడెంట్. సమాజాన్ని బాగు చేయాలి అనే ఉద్దేశంతో ఐఏఎస్ అధికారి అవుతాడు. అక్కడ ఓ కరప్షన్ పొలిటీషిన్(రమ్యకృష్ణ)కు అభిరామ్ ఎదురవుతాడు. తాను అనుకున్నది చేయాలి అనుకునే మనస్తత్వం ఉన్న రమ్యకు అభిరామ్ ఎలా ఎదురు వెళ్తాడు? ఆ తర్వాత ఏమైంది. రాజకీయ వ్యవస్థనే మార్చేందుకు తను ఏం చేస్తాడు? అనేది సినిమాలో చూడాలి. ఈ సినిమాలో సాయి అద్భుతంగా నటించాడు. ప్రభుత్వ అధికారిగా చక్కటి పాత్ర పోషించాడు. రమ్య క్రిష్ణ శక్తికి మించి నటించింది. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తో పాటు మిగతా నటులు రాహుల్ రామకృష్ణ, జగపతి బాబు కూడా అద్భుతంగా తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

ఈ సినిమాను దర్శకుడు దేవ కట్టా బాగా హ్యాండిల్ చేశాడు. ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, రిపబ్లిక్ అన్నీ ఒకే కోవకు చెందిన సినిమాలు. అద్భుతమైన స్ర్కీన్ ప్లేతో అందరినీ అదుర్స్ అనిపించాడు. ఎక్కడా పక్కకు వెళ్లకుండా తాను చెప్పాలనుకున్న పాయింట్ చక్కగా చెప్పాడు. క్లైమాక్స్ ను అద్భుతంగా రూపొందించాడు. మ్యూజిక్ విషయంలో మణిశర్మ పనితీరు అద్భుతం. సినిమా కథ, డైలాగులు, స్క్రీన్ ప్లే, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ప్రధాన పాత్రధారుల పెర్ఫార్మన్స్ ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. సినిమా అంతా సీరియస్ గా సాగడం, ఆశ లేదు అనేలా మెసేజ్ ఇవ్వడం మైనస్ పాయింట్స్ అంటున్నారు జనాలు. మొత్తం ఈ సినిమా జనాలను మాత్రం ఆకట్టుకుంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *