Breaking News

సాయి ధరమ్ తేజ్ పెళ్లి ఫిక్స్.. అల్లు శిరీష్ చెప్పింది ఇదేనా?

హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదానికి గురైన హీరో సాయి ధరమే తేజ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. తాజాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆయన.. ప్రస్తుతం రెస్టు తీసుకుంటున్నాడు. ఆయన బర్త్ డే సందర్భంగా మెగా ఫ్యామిలీ ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు చెప్పింది. చిరంజీవి, రాంచరణ్, బన్నీ, నిహారిక సహా కుటుంబ సభ్యులంతా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఆయన మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అటు అల్లు శిరీష్ చేసిన ఓ కామెంట్ ప్రస్తుతం పలు ఊహాగానాలకు తావిస్తుంది. ఇంతకీ ఆయన సోషల్ మీడియా ద్వారా ఏం చెప్పాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

సాయి ధరమ్ కు బర్త్ డే శుభాకాంక్షలు చెప్తూ అల్లు శిరీష్ ఓ విషయం చెప్పాడు. ఆయన పెళ్లి గురించి కీలక విషయాన్ని వెల్లడించాడు. ఒంటరి వ్యక్తిగా ఇది నీ చివరి పుట్టిన రోజు అని భావిస్తున్నాను. త్వరలో మీరు వీ వివాహ వార్తతో ముందుకు వస్తారు అనుకుంటున్నాను అని పోస్టు పెట్టాడు. అయితే ఈ కామెంట్ సాయి ధరమ్ తేజ్ పెళ్లి విషయాన్ని కచ్చితంగా తేల్చి చెప్తుందంటున్నారు సినీ జనాలు. ఇప్పటికే ఆయన పెళ్లి గురించి కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నారట. వీలైనంత త్వరగా ఆయన పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారట. సాయికి యాక్సిడెంట్ అయ్యాక.. ఇక ఆయనకు పెళ్లి చేయడం మంచిదని గట్టిగా ఫీలయ్యారట. ఆయనకు తగిన జోడీని కూడా ఎంపిక చేశారట. సాయికి బాగా తెలిసిన అమ్మాయితోనే పెళ్లి చేసేందుకు రెడీ అవుతున్నారట.

యాక్సిడెంట్ నుంచి కోలుకుంటున్న సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం పలు రకాల మర్దనలు చేయించుకుంటున్నాడు. ప్రస్తుతం గాయాల నుంచి చాలా వరకు కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. అటు తన బాగు కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పాడు సాయి ధరమ్ తేజ్. గత నెలలో ప్రమాదానికి గురైన ఆయన సుమారు నెల పాటు ఆస్పత్రిలో ఉన్నాడు. అటు ఆయన నటించిన రిపబ్లిక్ అనే సినిమా కూడా తాజాగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *