Breaking News

సాయిధరమ్ తేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడా? పవన్ కల్యాణ్ అలా ఎందుకు అన్నారు?

మెగాహీరో సాయిధరమ్ తేజ్‌కు బైక్ యాక్సిడెంట్ అయిన సంగతి అందరికీ విదితమే. మీడియాలో తేజ్ యాక్సిడెంట్ గురించి రకరకాలుగా కథనాలు ప్రసారం అయ్యాయి. ఇకపోతే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోలుకుంటున్నాడని అపోలో ఆస్పత్రి డాక్టర్స్ పేర్కొన్నారు. ఈ మేరకు బులెటిన్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే, ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ, సాయి ధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ ఫిల్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో తేజ్ ఆరోగ్య పరిస్థితిపై గందరగోళం ఏర్పడింది.

సినీ ఇండస్ట్రీకి చెందిన వారు తేజ్ కోలుకుంటున్నట్లు, ఆయనతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. డైరెక్టర్స్ కూడా తేజ్ హెల్త్ కండిషన్ బానే ఉన్నట్లు చెప్పారు. అయితే, పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలను బట్టి చూస్తే మాత్రం తేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడని, ఆయనకు ఇంకా ట్రీట్‌మెంట్ అందుతున్నదని తెలుస్తోంది. అయితే,పవన్ కల్యాణ్ యాక్సిడెంట్ అయిన రోజున చూసిన సంగతులు గుర్తు పెట్టుకున్నాడేమోనని మెగా అభిమానులు అంటున్నారు.

సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్న సంగతి గురించి పవన్ కల్యాణ్‌కు పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చని చెప్తున్నారు. అయితే, సాయి ధరమ్ తేజ్ హెల్త్ కండిషన్‌పై అపోలో ఆస్పత్రి యాజమన్యం స్పష్టమైన బులెటిన్ ఇటీవల కాలంలో ఎందుకు విడుదల చేయడం లేదని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘రిపబ్లిక్’ సినిమా డైరెక్టర్ దేవ్ కట్టా చేసిన వ్యాఖ్యలు కూడా అభిమానులను మరింత గందరగోళంతో పాటు భయాందోళన చెందేలా చేశాయి. దేవ్ కట్టా మాట్లాడుతూ తేజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్‌లో చూశాడని, చిత్రం అక్టోబర్ ఒకటో తారీకున విడుదల అవ్వాలని కోరుకున్నాడని తెలిపాడు. దాంతో అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. పవన్ ఏమో సాయి తేజ్ ఇంకా కోలుకోలేదన్నట్లు, బెడ్‌పై ఉన్నాడని అన్నట్లు మాట్లాడుతుండగా, దేవ్ కట్టా మాత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ చూశాడని మాట్లాడటం పట్ల అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ‘రిపబ్లిక్’ చిత్రం ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వం, ఏపీ మంత్రులపై ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ఏపీ పాలిటిక్స్‌లో దుమారమే రేగింది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *