Breaking News

సమంత మనసు ఎంత మంచిదో.. టాలీవుడ్ నటి ఆపరేషన్‌కు సాయం

తెలుగు చిత్ర పరిశ్రమలో సమంత ప్రస్తుతం అగ్రకథనాయికగా కొనసాగుతోంది. కానీ సామ్ గురించి, ఆమె చేసే మంచి పనుల గురించి ఎవరికీ తెలియకపోవచ్చు. సామ్ అనగానే పెద్దింటి కోడలు అనుకునే వారు ఒకప్పుడు. కానీ తన ఐడెంటిటీని, ఆమె చేస్తున్న సేవా పనుల గురించి బయటకు తెలియరాలేదు. తాజాగా సామ్ చేసే మంచి పనుల గురించి ఓ తెలుగు హీరోయిన్ రివీల్ చేసింది. సామ్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే ప్రత్యూష ఫౌండేషన్‌ను స్థాపించి తన సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తోంది. ఆపదలో ఉన్న పేదలు, చిన్నారులకు, బాలికలకు సాయం అందిస్తోంది. దివ్యాంగులు సహా పేద బాలికల విద్య కోసం సామ్ చేయని సాయం లేదట.. సమంతను చూసి చాలా నేర్చుకోవాలని ఒకానొక సందర్భంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారంటే ఆమె ఎంత గొప్పవారో అర్థం చేసుకోవచ్చు.

అయితే, ఇటీవల ఓ ఇంటర్య్యూలో సామ్ తనకు చేసిన మేలును నటి తేజస్వి మాదివాడ వెలుగులోకి తీసుకొచ్చారు. తేజస్వి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో పెద్దగా ఆఫర్లు ఏమీ రాలేదు. సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టులో సామ్ చెల్లెలుగా యాక్ట్ చేసింది. ఆ తర్వాత ఒకటో రెండో సినిమాల్లో సైడ్ హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తేజస్వితో ‘ఐస్ క్రీం’వంటి సినిమాలు చేసింది. అయితే, సినిమాల్లోకి రాకముందు తేజస్వి ఎన్నో కష్టాలను అనుభవించిందట.. తల్లి చిన్నతనంలోనే మరణించగా తండ్రి మద్యానికి బానిసయ్యాడు. తన పోషణ మరిచపోవడంతో తేజస్వి ఒంటరిగా హాస్టల్ లో ఉంటూ చదువుకుని ఇంత దూరం వచ్చింది.

తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాక సినిమా ఆఫర్ల ద్వారా వచ్చిన డబ్బులు తినే తిండికే సరిపోయేవట.. ఈ క్రమంలోనే తనకు కొన్నేళ్ల కిందట టీబీ వ్యాధి రావడంతో వైద్యులు ఆపరేషన్ చేయాలన్నరట.. తన వద్ద అన్ని డబ్బులు లేకపోవడంతో సమంతనే ఆపరేషన్‌కు కావాల్సిన డబ్బులు అరెంజ్ చేసిందట.. సామ్ చేసిన సాయం గురించి ఇన్నాళ్లు ఎవరికీ తెలీదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సామ్ చేసిన సాయాన్ని తేజస్వి రివీల్ చేయడంతో ఆమె సేవాగుణం గురించి అందరికీ తెలిసివచ్చింది. సామ్ గొప్ప నటి మాత్రమే కాదు.. మంచి మనస్సున్న మనిషి అని అందరూ మెచ్చుకుంటున్నారు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *