Breaking News

సమంత తో బంధం గురించి చై కి తెలుసు.. నోరు తెరిస్తే చంపేస్తాం అంటున్నారు .. జువాల్కర్ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ నటులు సామ్, చై విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించినా అందుకు గల కారణాలు ఇప్పటికీ స్పష్టంగా వెల్లడి కావడం లేదు. వీటిపై చాలా మంది చాలా రకాలుగా స్పందించారు. సామ్‌తో ప్రీతమ్ జుకల్కర్‌కు ఎఫైర్ ఉందని వస్తున్న ఆరోపణలపై ప్రీతమ్ స్పందించాడు. ఈ వార్తలపై చైతన్య నోరు విప్పకపోవడం తనను బాధించిందని వాపోయాడు. గతంలో సామ్‌కు జుకల్కర్ ఐలవ్‌యూ అని విశ్ చేశాడు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తున్నదనే వార్తలు జోరందుకున్నాయి. తన విడాకుల విషయంపై వస్తున్న పచారం తప్ప.. ఈ విషయంపై సామ్ ఇప్పటికీ స్పందించలేదు. దీనిపై ఎట్టకేలకు ప్రీతమ్ స్పందించాడు. దీనిపై సామ్ స్పందించకపోయినా తనకు బాధనిపించలేదని, కానీ చై సైలెంట్‌గా ఉండటం తనను ఎక్కువగా బాధించిందన్నాడు.

సామ్‌ను తాను జీజీ అని పిలుస్తానని, ఈ విషయం అందరికీ తెలుసన్నాడు. అలాంటిది తమ మధ్య లింక్ పెట్టాలని ఎలా అనిపిస్తుందంటూ ప్రశ్నించాడు. స్నేహితులకు, సోదరికి ఐలవ్‌యూ చెప్పకూడదా అని ప్రశ్నించాడు. విడాకుల కారణంగా బాధపడుతున్న ఓ మహిళను ఇలాంటి పుకార్లు చేస్తూ ఇంకెంత బాధపెడతారంటూ వాపోయాడు. సామ్, నా మధ్య ఎలాంటి బంధం ఉందో చై‌కు తెలుసన్నాడు. సామ్, నా గురించి చాలా మంది పద్దతి లేకుండా మాట్లాడుతున్నారని ఆ సందర్భంలో నాగ చైతన్య ఒక్క మాటైనా మాట్లాడతాడని అనుకున్నా అంటూ చెప్పుకొచ్చాడు. మా గురించి ఆయన ఒక స్టేట్‌మెంట్ ఇచ్చినా బాగుండేది అని జలక్కన్ అన్నాడు. మాపై వస్తున్న ఆరోపణలపై చే స్టేట్‌మెంట్ ఇస్తే అవన్నీ ఆగిపోయేవన్నాడు. ఈ ట్రోల్స్‌ను చూస్తుంటే భయం వేస్తున్నదని, నన్ను ఆయన చంపేస్తాడంటూ చాలా మంది బెదిరింపులకు పాల్పడుతున్నాడని వాపోయాడు. మా అమ్మ చనిపోయిందంటూ కొంత మంది వార్తలు రాశారని చెప్పుకొచ్చాడు. నా సోదరి, స్నేహితురాలు సామ్ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమేనని, సామ్‌కు అండగా ఉంటానని, దేనికి భయపడనని చెప్పాడు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *