Breaking News

సమంత ఆ కండిషన్స్ కి ఒకే చెప్తే సరే ,, లేదంటే విడాకులు ఖాయం అంటున్న అక్కినేని ఫ్యామిలీ

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా నాగచైతన్య-సమంతకు పేరుంది. అయితే, గత కొద్ది రోజుల నుంచి వీరు విడిపోతున్నారని వార్తలొస్తున్నాయి. వీటిపై సామ్ కాని నాగచైతన్య కాని నాగార్జున కుటుంబ సభ్యులు కాని స్పందించడం లేదు. దాంతో సమంత విడాకులు ఇచ్చేసిందని, నాగార్జున కుటుంబ సభ్యులు భరణంగా కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని బోలెడన్ని వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే, అసలు సమంత ఎందుకు నాగచైతన్యకు విడాకులు ఇస్తుందో ఇండస్ట్రీ వర్గాల్లు, నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

వెండితెరపై కపుల్‌గా నటించి రియల్ లైఫ్‌లో జంటగా మారిన నాగచైతన్య-సమంత మొదట్లో బాగానే ఉన్నా.. ఆ తర్వాత కాలంలో వారి మధ్య గ్యాప్ ఏర్పడిందట. ఇందుకు ప్రధాన కారణం సమంత డ్రెస్సింగ్ స్టైల్ అని తెలుస్తోంది. పెళ్లికి ముందర ఎలా ఉన్నా పెళ్లి అయిన తర్వాత సంప్రదాయ బద్ధంగా భారతీయ సంస్కృతిని అనుసరించే ఉండాలని అక్కినేని కుటుంబ సభ్యులు చెప్పారని వినికిడి. అయితే, మొదట్నుంచి సామ్ డిఫరెంట్ డ్రెస్సెస్ ధరిస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఈ క్రమంలోనే చైతన్యతో మ్యారేజ్ తర్వాత కూడా సామ్ హాట్ ఫొటోషూట్స్ చేసి సోషల్ మీడియా వేదికగా అప్ లోడ్ చేసింది. అయితే, వాటిని చూసి చైతన్య వారించారని, అయినా సామ్ వినలేదని టాక్.

ఈ క్రమంలోనే తను ధరించే బట్టల విషయంలో ఆంక్షలు నచ్చక సమంత విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. దాంతో పాటు సినిమాలు, వెబ్ సిరీస్‌లు తనకు నచ్చినవి చేస్తుంటే అక్కినేని కుటుంబ సభ్యుల అభ్యంతరాలు ఏంటని సామ్ ఫైర్ అయిందట. ‘ది ఫ్యామిల్ మ్యాన్ 2’ సిరీస్‌లో సామ్ బోల్డ్ క్యారెక్టర్ ప్లే చేసింది. అది చూసి చైతన్య, అక్కినేని కుటుంబ సభ్యులు చాలా డిసాప్పాయింట్ అయినట్లు సోషల్ మీడియాలో కొందరు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే సమంతకు విడాకులు ఇవ్వడంతో పాటు రూ.50 కోట్లు భరణంగా ఇచ్చేందుకు అక్కినేని కుటుంబీకులు సిద్ధం అయ్యారట. అయితే, అక్కినేని వారి అభిమానులు మాత్రం చై-సామ్ విడిపోవద్దని కోరుతున్నారు. కలిసి మెలిసి ఉండాలని సూచిస్తున్నారు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *