Breaking News

సమంతను తప్పుదారి పట్టించిన పంచగ్రహాలు వీళ్ళే. అందుకే చైతన్యతో విడాకులు..!

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా ఉన్న సమంత, నాగచైతన్య విడిపోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసిన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే సమంత విడాకులు ప్రకటన అనంతరం సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు పట్ల పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కొంత మంది నెటిజన్లు సమంతను ట్రోల్ చేస్తున్నారు.

ఇకపోతే సమంతను తప్పు దారి పట్టించిన వారిలో ఓ మహిళా దర్శకురాలు, బొటిక్ ఓనర్, గైనకాలజిస్ట్, హెయిర్ స్టైలిస్ట్, ఫ్యాషన్ డిజైనర్ ఉన్నారని ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే సమంత గతంలో డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్‌తో దిగిన ఫొటోలు నెట్టింట షేర్ చేస్తున్నారు కొందరు. సమంత చేసే బోల్డ్ పాత్రలు నచ్చడం లేదని అక్కినేని నాగచైతన్య చెప్పడం వల్ల వారిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడిందని, అది ఇంకా కొనసాగి విడిపోయే వరకు దారి తీసిందని కొందరు అంటున్నారు. ఈ మేరకు వార్తలు వస్తున్నాయి. అయితే, తామిద్దరం చాలా సుదీర్ఘంగా చర్చించుకున్న తర్వాతనే విడిపోయేందుకు సిద్ధమయ్యామని నాగచైతన్య, సమంత పేర్కొన్నారు. నాగచైతన్య, సమంత విడిపోవడానికి డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ ఎలా కారణమని కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే భరణంగా సమంతకు ఆల్రెడీ జయభేరీలోని ఇల్లు ఇచ్చేశారని, రూ.50 కోట్ల నగదుతో పాటు రూ.250 కోట్ల ప్రాపర్టీ ఇచ్చారని వార్తలొస్తున్నాయి. అయితే, ఈ విషయమై ఎటువంటి అధికారిక ప్రకటనలు అయితే రాలేదు. ఇందుకు సంబంధించి బోలెడన్ని వార్తలు వస్తున్నా ఎందులోనూ క్లారిటీ అయితే రాలేదు. ఇకపోతే నాగచైతన్య, సమంత విడాకులు ప్రకటన వచ్చిన కొన్ని గంటల తర్వాత హీరో సిద్ధార్థ్ ‘మోసగాళ్లు ఎప్పుడూ అభివృద్ధి చెందరు’ అనే లెస్సన్‌ను స్కూల్‌లో టీచర్స్ మొదట నేర్పిస్తారని, అదే తొలి పాఠమని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. దీంతో హీరో సిద్ధార్థ్ ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నారని చర్చ నడుస్తున్నది. సిదార్థ్ సమంత ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని, ఆయన్ను సామ్ మోసం చేసిందని, అందుకే ఇలాగా సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *