Breaking News

షూటింగ్ స్పాట్ లో చిరంజీవి చెంప పగలగొట్టిన సీనియర్ హీరోయిన్..

చిరంజీవి.. తెలుగు సినిమా పరిశ్రమలో మెగా హీరో. తన అద్భుత నటనతో జనాల మనసుల్లో నిలిచిపోయాడు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో యాక్ట్ చేసి తిరుగులేని యాక్టర్ గా నిలిచిపోయాడు. తెలుగు సినిమా పరిశ్రమలో ఇండస్ట్రీ హిట్లు కొట్టి తన సత్తా చాటాడు. వరుస విజయాలతో ముందుకు సాగుతూ దశాబ్దాలుగా టాప్ హీరోగా చలామణి అవుతున్నాడు. అలాంటి చిరంజీవిని ఓ సీనియర్ హీరోయిన్ చెంప పగులగొట్టింది. ఇంతకీ చిరును కొట్టిన ఆ నటి ఎవరు? ఎందుకు కొట్టింది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

చిరంజీవి చెంప వాచిపోయేలా కొట్టిన హీరోయిన్ మరెవరో కాదు.. రాధిక. చిరంజీవి, రాధిక హీరో, హీరోయిన్లుగా పలు సినిమాలు చేశారు. నటి రాధిక చిరంజీవితో కలిసి నటించిన తొలి మూవీ ప్రియ. కానీ.. విడుదలైన తొలి సినిమా మాత్రం న్యాయం కావాలి. ఈ సినిమాకు కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించగా.. క్రాంతి కుమార్ నిర్మించాడు. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీ విజయం తర్వాత చిరంజీవి, రాధిక మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరు కలిసి పలు సినిమాల్లో నటించారు. చిరంజీవి మద్రాస్ శ్రీనగర్ లో ఉండేవాడు. ఆయన ఇంటి పక్కనే రాధిక ఉండేది. తరుచుగా చిరు ఇంటికి వెళ్లేది రాధిక. మొత్తంగా ఇద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యారు.

న్యాయం కావాలి సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవి, రాధిక మధ్య పలు ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగాయి. ఈ సినిమాలో చిరంజీవి రాధికను మోసం చేసే క్యారెక్ట్ చేస్తాడు. రాధికను లవ్ చేశానని చెప్పి శారీరకంగా ఆమెను అనుభవిస్తాడు. ఆ తర్వాత ఆమెను వదిలించుకోవాలి అనుకుంటాడు. తనను ఎందుకు మోసం చేశావని చిరంజీవిని రాధిక అడుగుతుంది. అప్పుడే చిరంజీవి పగలగొడుతుంది. ఈ షాట్ సరిగా రాకపోవడంతో రీటేక్ చేయాల్సి వచ్చింది. ఈ టేకుల్లో చిరంజీవి చెంపను నిజంగానే పగలగొట్టింది రాధిక. షాట్ ఓకే అయ్యింది. కానీ చిరంజీవి చెంప వాచిపోయింది. ఆ తర్వాత కాస్త క్రీమ్ పూసి తగ్గేలా చేశారు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *