Breaking News

షూటింగ్ సెట్ లోనే యాంకర్ శ్యామలను కొట్టింది ఎవరు ? దాడికి గల కారణం ఏంటి ?

తెలుగు టీవీ పరిశ్రమలో యాంకర్ గా మంచి గుర్తింపు పొందింది శ్యామల. బుల్లితెరపై స్టార్ యాంకర్ గా సుమ కొనసాగుతుండగా.. అంతే స్థాయి పేరు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ అమ్మడు ఓ యూట్యూబ్ చానెల్ కూడా రన్ చేస్తోంది. ఇప్పుడు యాంకర్ గా కెరీర్ కొనసాగిస్తున్న శ్యామల.. గతంలో సీరియల్ ఆర్టిస్టుగా చాలా కాలం యాక్ట్ చేసింది. పలు సీరియల్స్ లో నటించి మంచి పేరు ప్రఖ్యాతులు పొందింది. సీరియల్ నటిగా కొనసాగుతున్న సమయంలోనే తన సహ నటుడు నరసింహారెడ్డితో ప్రేమలో పడింది. అతడితో చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగింది. కొంత కాలం తర్వాత ఈ విషయం శ్యామల ఇంట్లో తెలిసింది. పెద్ద దుమారం చెలరేగింది. కుటుంబ సభ్యులు తనను తీవ్రంగా మందలించడంతో పాటు తీవ్రంగా కొట్టారట.

శ్యామల, నరసింహారెడ్డి ప్రేమ విషయం తొలుత శ్యామల తల్లికి తెలిసిందట. ఆమె వీరి ప్రేమకు అడ్డుపడిందల. అయినా వినకపోవడంతో నరసింహారెడ్డి తల్లిదండ్రులను పిలిచిందట. అయితే అప్పటికే ఆయన పేరెంట్స్ అమెరికాలో ఉన్నారట. రావడానికి రెండు సంవత్సరాలు పడతాయని చెప్పారట. రెండు సంవత్సరాల తర్వాత మాట్లాడి పెళ్లి చేస్తామని శ్యామలకు తల్లిదండ్రులు చెప్పారట. అయితే తన తల్లి తనను మోసం చేస్తుందని ఆమె భావించిందట. దీంతో తను అలర్ట్ అయ్యిందట. అదే సమయంలో ఓ రోజు షూటింగ్ కు వెళ్లిన శ్యామలను తీసుకెళ్లడానికి శ్యామల తల్లి, బావ వచ్చారట. అయితే శ్యామల తల్లికి నర్సింహారెడ్డి మేనేజర్ కు పెద్ద గొడవ అయ్యిందట. ఈ గొడవ ఏకంగా కొట్లాడుకునే స్థాయికి వెళ్లిందట. అక్కడే శ్యామలను కొట్టిందట తల్లి.

ఆ తర్వాత శ్యామల ఇంటికి వెళ్లిందట. అయితే తనకు సంబంధించిన ఏ వస్తువు కూడా కనిపించలేదట. ఈ విషయాన్ని శ్యామల నర్సింహారెడ్డికి చెప్పిందట. దీంతో తనను తీసుకెళ్లి వాళ్ల అక్క ఇంట్లో ఉంచాడట నర్సింహారెడ్డి. ఆ సమయంలో తన వయసు కేవలం 17 సంవత్సరాలట. ఓ సంవత్సరం వరకు తను అక్కడే ఉందట. అనంతరం శ్యామలను పెళ్లి చేసుకున్నాడట. ఈ పెళ్లి తర్వాత రెండు సంవత్సరాల వరకు తన తల్లి శ్యామలతో మాట్లాడలేదట. ఆ తర్వాత నెమ్మదిగా మాటలు కలిశాయట.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *