Breaking News

షాకింగ్ : ‘సామ్ చై’‌ను ఫాలో అవుతున్న పవన్.. ముచ్చటగా మూడోసారి విడాకులు..?

సినిమా ఇండ్రస్ట్రీలో ఎక్కువగా ప్రేమ వివాహాలకే సెలెబ్రిటీలు మొగ్గుచూపుతుంటారు. అయితే, వీరు ఎంతకాలం కలిసి ఉంటారో అనేది ప్రస్తుత రోజుల్లో ఒక క్వశ్చర్ మార్క్‌లా మారిపోయింది. అందుకు కారణం ఇటీవల టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా పేరొందిన సామ్ చై విడిపోవడమే. గతంలోనూ చాలా మంది స్టార్ సెలెబ్రిటీలు ప్రేమ వివాహం చేసుకోవడానికి ముందు తమ భార్యలకు విడాకులు ఇచ్చిన వారే. అక్కినేని వంశంలో ఇదే మొదటి విడాకులు కాదు. అప్పట్లో హీరో నాగార్జున కూడా తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి అమలను ప్రేమవివాహం చేసుకున్నారు. కానీ ఆ జంట ఇప్పటివరకు సంతోషంగా కలసిమెలిసి జీవనం సాగిస్తోంది.

ఇకపోతే సామ్ చై విడాకుల మ్యాటర్ ఎంత కాంట్రవర్సీ అయ్యిందనేది మీ అందరికీ తెలిసిందే. జులై నెలలో సమంత తన సోషల్ మీడియా అకౌంట్ ఐడీకి చివర్లో సమంత అక్కినేని అని తీసేసి S అని యాడ్ చేయడంతో సామ్ చైతూ విడిపోతున్నారని పెద్ద ఎత్తున రూమర్లు వచ్చాయి. దీనిపై సామ్ చై ఎవరూ నేరుగా స్పందించలేదు. చివరకు ఈ గందరగోళానికి నాగచైతన్య ముగింపు పలికాడు. ఇన్ స్టా వేదికగా నేను సామ్ విడిపోతున్నాం అని చెప్పగానే అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇలా విడాకులు తీసుకున్న వారి గురించి చెప్పుకుంటూ పోతే సినిమా ఇండస్ట్రీలో పెద్ద లిస్టే ఉంటుంది. నాగార్జున, అక్కినేని సుమంత్, సింగర్ సునీత, మోహన్ బాబు, పవన కళ్యాణ్, రీసెంట్‌గా మంజు మనోజ్ కూడా విడాకులు తీసుకున్నవారిలో ఉన్నారు.

ఇకపోతే ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్‌లోనే సెన్సెషన్. అయితే, పవన్ హీరోగా ఎంత సక్సెస్ అయినా చాలా మంది ఆయన పర్సనల్ లైఫ్ ను టార్గెట్ చేస్తుంటారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నావ్ నువ్వు ఎందీ మాకు చెప్పేది అన్నట్టుగా మాట్లాడుతుంటారు. దీనికి ఫ్యాన్స్ కూడా గట్టిగానే బదులిస్తుంటారు. అయితే, సామ్ చైతన్య బాటలోనే పవన్ తన మూడో భార్య అన్నా లెజీనోవాతో విడిపోతున్నారనే విషయం సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. వారి మధ్య మనస్పర్దలు వచ్చాయని, అందుకే పవన్ ప్రస్తుతం ఒంటరిగా, ప్రజల మధ్యే ఉంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో పవన్ తప్పా మూడు పెళ్లిళ్లు ఎవరూ చేసుకోలేదు. పవన్ తన మూడో భార్యకు విడాకులు ఇస్తున్నారని తెలియడంతో పవన్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. అవన్నీ రూమర్లు అని కొట్టిపారేస్తున్నారు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *