Breaking News

షాకింగ్ న్యూస్ : యాంకర్ సుమకు అరుదైన వ్యాధి.. ఆందోళనలో అభిమానులు

యాంకర్ సుమ.. అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో తెలియని వారుండరు. ఆమెకు ఇంకో పేరుంది.. అదే బుల్లితెర క్వీన్.. అంతేకాకుండా ఆడియో ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ఒక్కటేంటి ఇలా ప్రతీ ఈవెంట్‌లోనూ సుమ మార్క్ కనిపిస్తుంది. హీరోయిన్ల కంటే కూడా సుమ చాలా బిజీగా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్. ఎందుకంటే ఆమె చేసే రియాల్టీ షో లే అందుకు కారణం. ఒక్కొసారి అగ్రతారల ఆడియో ఫంక్షన్స్, సక్సెస్ మీట్లకు ఆమె కాల్ షీట్లు దొరకవంటే అతిశయోక్తి కాదు. ఆమె యాంకరింగ్‌కు అంత క్రేజ్‌ ఉంది మరీ.

టీవీ సీరియల్‌తో కెరీర్‌ ప్రారంభించిన సుమ ఆ తర్వాత యాంకరింగ్‌ వైపు వెళ్లింది. నేటివ్ ప్లేస్ కేరళ అయినా అచ్చ తెలుగు మాట్లాడగలదు సుమ. ఆమె తల్లి తొలుత తెలుగు భాష నేర్చుకుని తన కూతురుకు నేర్పించిందట. అందువల్లే సుమ గలగల తెలుగు మాట్లాడగలదు. ఆవిడ కృషి వల్లే బుల్లితెరకు వండర్ ఫుల్ యాంకర్‌ దొరికిందని చెప్పుకుంటారు. సుమ నటుడు రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఒక యూట్యూబ్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక భయంకరమైన నిజాన్ని సుమ తన ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఒక అరుదైన వ్యాధితో ఆమె బాధపడుతుందని వెల్లడించింది. ఇన్ని రోజులు చెప్పేందుకు ధైర్యం సరిపోలేదని వివరించింది.

చాలా రోజులుగా నేను అరుదైన వ్యాధితో బాధపడుతున్నా.. దానిన క్యూర్‌ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశా అని చెప్పుకొచ్చింది. అది ఇంకా తగ్గదని తెలిసాక అభిమానులతో పంచుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిపింది. ‘‘నేను ఒక అరుదైన చర్మవ్యాధి వచ్చింది. దాని పేరు కెలాయిడ్‌ టెండెన్సీ’’ అని చివరకు వెల్లడించింది. నాకు ఏదైనా గాయమైతే.. ఈ వ్యాధి వలన అది అవ్వాల్సిన మొతాదు కంటే ఎక్కువగా హీల్‌ అవుతుందని వివరించింది. ఏ చిన్న గాయమైన నా ఒంటిపై దాని ఆనవాళ్లు అంత ఈజీగా పోవు. గాయం మానినా.. మరకలు అలాగే కనిపిస్తాయి. ఇన్నిరోజులు నేను దానిని దాచిపెట్టాను. ఇంక దాచిపెట్టాలని అనుకోవడం లేదని ప్రకటించింది. ఏ వ్యక్తి అయినా వారిలో లోపాలు ఉంటే దాచుకోవడం సరికాదు. అందరి ముందు ఓపెన్‌ గా చెబితే ఆ భయం అనేది పోతుందని చెప్పింది. ఏదో తప్పు చేస్తున్నా అనే భావన కూడా పోతుందని వెల్లడించింది. చర్మ వ్యాధికి క్యూర్ లేకపోయినా.. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని సుమ అభిమానులు కూడా భావిస్తున్నారట. మరీ భయంకరమైన వ్యాధి కాకపోవడంతో పెద్ద ప్రమాదం ఏమీ ఉండదని అంతా ఊపిరిపీల్చుకున్నారని తెలుస్తోంది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *