Breaking News

వేల మందికి సహాయం. కన్ను మూస్తూ కూడా ఇద్దరికి ప్రాణం ఇచ్చిన పునీత్ రాజ్ కుమార్

పునీత్ రాజ్‌కుమార్.. కన్నడ సినిమా పరిశ్రమలో అద్భుత నటుడు. ఎన్నో చక్కటి సినిమాల్లో నటించి గొప్ప నటుడిగా గుర్తింపు పొందాడు. అంతేకాదు.. ఎలాంటి సినిమాలు చేస్తే జనాలు బాగా ఆదరిస్తారో ఆయనకు బాగా తెలుసు. అంతే కాదు.. మంచి కథలను ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందుండేవాడు పునీత్. ఎప్పుడూ కమర్షియల్ సినిమాలే కాదు.. అప్పుడప్పుడూ సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు కూడా చేశాడు. జనాల చేత శభాష్ అనిపించుకున్నాడు. ఆయన చేసే కమర్షియల్ సినిమాలను జనాలు ఓ రేంజిలో ఆదరించేవారు. మాస్ జనాల్లో ఆయనకున్న ఫాలోయింగ్ మామూలుగా ఉండదు.


పునీత్ ఇప్పటి వరకు మొత్తం 29 సినిమాలు చేశాడు. అందులో పలు తెలుగు రీమేక్ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా ద్వారా ఆయన తెలుగు జనాలకు కూడా పరిచయం అయ్యాడు. ఆయన చేసిన తొలి తెలుగు రీమేక్ మూవీ అప్పు. అందుకే జనాలు ఇప్పటికీ ఆయను అప్పుగానే పిలుస్తారు. ఆ సినిమా జనాల్లో ఎంత గుర్తింపు తెచ్చుకుందో చెప్పలేం. ఈ సినిమా తెలుగులో రవితేజ నటించిన ఇడియట్ మూవీకి రీమేక్. ఈ సినిమాకు కన్నడలో దర్శకత్వం వహించింది కూడా పూరీ జగన్నాథే. ఆయన డబ్యూ మూవీగా అప్పు మంచి విజయం అందుకుంది. అప్పు సినిమాతో కన్నడ సినిమాలో అద్భుత ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి విజయాన్ని అందుకున్నాడు. తెలుగులో ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాల సినిమాను కన్నడలో కన్నడిగా రీమేక్ చేశాడు. ఈ సినిమా ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాతో టాప్ హీరోగా ఎదిగాడు పునీత్. మహేష్ బాబుకు చెందిన పలు సినిమాలను ఆయన కన్నడలో రీమేక్ చేశాడు. పునీత్ చాలా వరకు రీమేక్ సినిమాల ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

సినిమాలే కాదు.. సామాజిక సేవల్లోనూ ముందున్నాడు పునీత్. ఆయన 26 అనాథ ఆశ్రమాలను నడిపిస్తున్నాడు. 16 ఓల్డేజ్ హోం లను నిర్వహిస్తున్నాడు. 1800 మంది విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తున్నాడు. అంతేకాదు.. తను చనిపోవడానికంటే ముందే తన కళ్లను దానం చేసి గ్రేట్ హ్యూమన్ బీయింగ్ గా నిలిచాడు పునీత్.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *