Breaking News

విడాకుల విషయంలో కోడలికి అమ‌ల స‌పోర్ట్‌… సెటైర్ వేసిందా ?

చైతు – స‌మంత విడాకుల వ్య‌వ‌హారం ముగిసింది. నెల రోజుల ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. అస‌లు కార‌ణాలు ఏవైనా కూడా వీరిద్ద‌రు విడిపోవ‌డానికి అమ‌ల స‌మంత‌పై పెట్టిన తీవ్ర‌మైన కండీష‌న్లు కూడా ఓ కార‌ణ‌మే అన్న ప్ర‌చారం అయితే బ‌య‌ట‌కు వ‌చ్చింది. ముఖ్యంగా స‌మంత మ‌రీ అస‌భ్య‌క‌ర‌మైన డ్రెస్సుల‌తో రెచ్చిపోవ‌డం, దీనికి తోడు ఫ్యామిలీమ్యాన్ – 2 వెబ్‌సీరిస్ త‌ర్వాత అమ‌ల… మ‌రింత సీరియ‌స్‌గా వార్నింగ్‌లు ఇవ్వ‌డంతో పాటు అటు నాగ్‌, చైతుపై ఒత్తిడి చేసి మ‌రీ స‌మంత‌పై ఆంక్ష‌లు పెట్ట‌డం ఆమెకు న‌చ్చ‌లేద‌ని.. ఇది కూడా చైతు – స‌మంత మ‌ధ్య గ్యాప్ మ‌రింత పెరిగేందుకు కార‌ణ‌మైంద‌నే అంటున్నారు.

ఇక విడిపోయాక దీనిపై చిలువ‌లు ప‌లువ‌లుగా ఎన్ని వార్త‌లు వ‌స్తున్నా కూడా నాగార్జున చిన్న పోస్ట్ పెట్ట‌డం, దానిని అమ‌ల షేర్ చేయ‌డం మిన‌హా ఎవ్వ‌రూ ప‌బ్లిక్‌గా స్పందించ‌లేదు. అయితే అమ‌ల మాత్రం ఈ విడాకుల ప్ర‌క‌ట‌న వ‌చ్చాక స‌మంత లైఫ్‌.. స‌మంత ఇష్టం అని చెపుతున్న‌ట్టు అక్కినేని కాంపౌండ్ వ‌ర్గాల నుంచి మ్యాట‌ర్ లీక్ అయ్యింది. స‌మంత త‌న లైఫ్‌.. త‌న‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్టుగానే కొన‌సాగించుకోవ‌చ్చ‌ని అమ‌ల చెప్పేసింద‌ట‌.

అయితే ఇది స‌పోర్టింగ్‌గా చెప్పిందా ? సెటైరిక‌ల్‌గా చెప్పిందా ? అన్న‌ది మాత్రం క్లారిటీ లేదు. స‌మంత డ్రెస్సులు, ఆమె పెళ్ల‌య్యాక కూడా సినిమాలు చేయ‌డం.. మ‌రీ బోల్డ్‌గా న‌టిస్తుండ‌డం ముందు నుంచి అమ‌ల‌కే ఇష్టం లేద‌న్నది తెలిసిందే. దీనిపై ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు స‌మంత అక్కినేని ఫ్యామిలీ నుంచి కోడ‌లు హోదా వ‌దుల‌కుని చైతుకు విడాకులు ఇవ్వడం అమ‌ల‌కు ఇష్ట‌మేనా ? అందుకే ఆమె స‌మంత వెళ్లిపోయినా ఇబ్బంది లేద‌న్న ఫీలింగ్‌తో ఉందా ? లేదా స‌మంత నిర్ణ‌యాన్ని గౌర‌విస్తూ ఆమె లైఫ్ ఆమె ఇష్ట‌మ‌ని చెపుతోందా ? అన్న మాట‌ల అర్థం అమ‌ల‌కే తెలియాలి.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *