Breaking News

విడాకులు ఇవ్వకపోతే నా భార్యను చంపేద్దాం అనుకున్నాను : నటుడు సంపత్ రాజ్

శరణ్య. తమిళ సినిమా పరిశ్రమలో ఈ పేరు గురించి పరిచయం అక్కర్లేదు. రఘువరన్ బిటెక్ సినిమాలో హీరో తల్లి పాత్ర చేసిన నటీమణే శరణ్య. అంతేకాదు.. సూర్య నటించిన 24 సినిమాలోనూ సూర్య తల్లిగా నటించింది అందరి చేత ప్రశంసలు దక్కించుకుంది. ఈమె తెలుగు జనాలకు కూడా సుపరిచితం అయిన నటి. సినిమా పరిశ్రమలో ఎన్నో చక్కటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే నిజ జీవితంలో మాత్రం పలు సమస్యలను ఎదుర్కొంది ఈ నటీమణి. ముఖ్యంగా ఈమె వైవాహిక జీవితం అంతా సమస్యలతోనే నిండిపోయింది.

ఇంతకీ శరణ్య భర్త ఎవరో తెలుసా? తెలుగులో పలు సినిమాల్లో విలన్ పాత్రలు చేసిన సంపత్ రాజ్. అవును వీరిద్దరు భార్య భర్తలు. మొదట తమిళ సినిమాల ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన.. ఆ తర్వత చక్కటి నటనతో తెలుగు సినిమా పరిశ్రమలోకి కూడా అడుగు పెట్టాడు. నెమ్మదిగా హిందీ, మలయాళం సినిమాల్లోనూ నటుడిగా సత్తా చాటాడు. తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. అంతేకాదు.. తన భార్య గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు.

తన భార్య 23 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు తనతో పెళ్లి అయ్యిందని చెప్పాడు. అయితే సినిమాల్లో బిజీగా ఉండటం మూలంగా చాలా ఇబ్బంది పడినట్లు చెప్పాడు. ఒకానొక సమయంలో సినీ కెరీర్ ను, పర్సనల్ లైఫ్ ను మేనేజ్ చేయలేక చాలా ఇబ్బంది పడినట్లు వెల్లడించాడు. అందుకే ఇద్దరు ఇక కలిసి ఉండలేమని భావించి విడాకులు తీసుకున్నట్లు వెల్లడించాడు. అప్పటికే తమకు ఓ అమ్మాయి ఉందని చెప్పాడు. ఆమె ఆలనాపాలనా తానే చూసుకున్నట్లు చెప్పాడు. తన ప్రస్తుతం చదువులు పూర్తి చేసుకుందని.. కెరీర్ ను ఎంచుకునే పనిలో ఉన్నట్లు వెల్లడించింది. తన భార్యతో విడాకులు తీసుకున్నా.. ఇప్పటికీ ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటానని చెప్పాడు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *