Breaking News

విడాకులకు అతడే కారణం.. సమంతపై సోషల్ మీడియాలో ట్రోలింగ్..! ఇంతకి ఎవరితను ?

అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోతున్నట్లు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ విషయం తెలుసుకుని అక్కినేని నాగార్జున, అక్కినేని అభిమాణులు షాక్ అయ్యారు. నాగార్జున అయితే బరువెక్కిన హృదయంతో.. ఆ ఇద్దరూ బాగుండాలని, వారికి దేవుడు ఆత్మస్థైర్యం ఇవ్వాలని కోరకుంటున్నట్లు పేర్కొన్నాడు. కాగా, సామ్ మాత్రం విడిపోతున్నట్లు చేసిన ప్రకటన తర్వాత అనుమానాస్పద పోస్ట్ ఒకటి పెట్టింది. దీంతో కొందరు నెటిజన్లు, అక్కినేని ఫ్యాన్స్ సమంతను ట్రోల్ చేస్తున్నారు.

సామ్ చేసిన పోస్ట్ ద్వారా తన విడాకులు వెనుక ఎవరో కుట్రలు చేసినట్లు అర్థం వచ్చేలా పోస్టు ఉంది. ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత సమంత ఎక్స్‌పోజింగ్ చేయడాన్ని అక్కినేని ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు, ఇక అక్కినేని కుటుంబ సభ్యులు ఎలా తట్టుకోగలరు అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అమల లాగా ఏదేని ఎన్జీవో చూసుకుంటూ హెల్దీ రోల్స్ ప్లే చేసుకుంటూ ఉంటే బాగుండేదని కొందరు అంటున్నారు. అయితే, స్వతంత్ర భావాలున్న మహిళలు వంటింట్లో ఇమడబోరు అని సమంతను సపోర్ట్ చేస్తూ కొందరు పోస్టులు పెడుతున్నారు. ఇకపోతే సమంత అప్పట్లో పోస్ట్ ఒకటి బయటకు తీసుకొచ్చి దాని ద్వారా సమంతను ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సమంత అప్పట్లో ఫ్యాషన్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ ఒడిలో కాళ్లు పెట్టుకుని దిగిన ఫొటో ఒకటి పోస్ట చేసి సామ్.. ఇలా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.

ఈ క్రమంలోనే సమంత విడాకులు తీసుకోవడానికి ప్రీతమ్ జుకల్కరే కారణం అని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే, ప్రీతమ్ జుకల్కర్ అబద్ధాలు, రహస్యాలు బంధాలను చంపేస్తాయని, నువ్వెంత జాగ్రత్తగా ఉన్నా.. ఏదో ఒక రోజు దొరికిపోతావ్ అంటూ తన స్టేటస్‌లో పెట్టాడని, కొద్ది క్షణాల్లో ఆ స్టేటస్ డిలీట్ చేశాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ సంగతులను బట్టి చూస్తే ప్రీతమ్ జుకల్కర్ వల్లే సమంత నాగచైతన్య నుంచి విడిపోయిందా అని ప్రశ్నలు వేస్తున్నారు నెటిజన్లు. మొత్తంగా నాగచైతన్య, సమంత విడిపోతున్న వార్త ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిందంటూ మరి కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *