Breaking News

వాటిని ఇంట్లోకి తెస్తే మీరు బయటకు వెళ్లాలి.. కొడుకు, కోడలికి చిరంజీవి వార్నింగ్..

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినిమా పరిశ్రమలో దిగ్గజ నటుడు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టి.. తన చక్కటి నటనతో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. అందుకే ఆయనకు సినిమా పరిశ్రమలో ఏ హీరోకు లేని గౌరవం ఆయనకు ఉంటుంది. చిన్న పెద్ద అని తేడా లేదు.. అందరికీ ఆయనంటే ఇష్టం. తన నటనతో అందరినీ అమితంగా ఆకట్టుకోవడం చిరంజీవి ప్రత్యేకత. కామెడీ అయినా.. యాక్షన్ అయినా.. ఏ సినిమా అయినా సరే.. తన నటనతో అదరగొట్టాల్సింది. రాజకీయాలతో కొంత కాలం సినిమాలకు దూరం అయిన చిరంజీవి.. ఆ తర్వాత రెండో ఇన్సింగ్స్ ప్రారంభించి ఫుల్ స్వింగ్ లో ముందుకుసాగుతున్నాడు. కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నాడు.

చిరంజీవి నటన ఒక్కటే కాదు.. ఆయన ప్రవర్తన కూడా ఈ స్థాయికి రావడానికి ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. సినిమా సెట్స్ లో తను ప్రవర్తించే తీరు చాలా చక్కగా ఉంటుంది. లైట్ బాయ్ నుంచి దర్శకుడి వరకు.. తోటి నటులతోనూ చక్కగా ప్రవర్తిస్తాడు. సినిమా షూటింగ్ స్పాట్ లోకి అడుగు పెడితే.. షెడ్యూల్ పూర్తయ్యే వరకు అక్కడి నుంచి వెళ్లడు. ప్యాకప్ చెప్పాక నేరుగా తను ఇంటికే వెళ్తాడు. అంతేకాదు.. అనవసర విషయాల్లో తను తలదూర్చడు. లేనిపోని వివాదాల జోలికి పోడు. ఫ్యామిలీకి తను ఇచ్చే ప్రాధాన్యత చాలా ఎక్కువ. అంతేకాదు.. తన కుటుంబ సభ్యులెవరూ ఆయన మాటను కాదనరు.

చిరంజీవి తన కుటుంబ సభ్యుల పట్ల ఎంతో ప్రేమ చూపిస్తాడు. తన కొడుకు రాంచరణ్ మీద చాలా అంటే చాలా లవ్. తనకు పెళ్లైనా అదే ప్రేమనకు కనబరుస్తాడు చిరంజీవి. కొడుకుతో పాటు కోడలను కూడా చాలా ప్రేమగా చూసుకుంటాడట. అయితే ఒకానొక సమయంలో కొడుకు, కోడలు మీద ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చిందట. అదే సమయంలో వారిని ఇంటి నుంచి బయకు పంపించాలి అనుకున్నాడట. ఇంతకీ తనకు అంత కోపం ఎందుకు వచ్చిందో తెలుసా? రాంచరణ్, ఉపాసనకు జంతువులంటే ఇష్టం. అందుకే ఇంటి నిండా వాటిని పెట్టుకున్నారు. అయితే ఇంట్లో జంతువులు ఎక్కువ కావడం మూలంగా తనకు ప్రశాంత కరువైనట్లు ఫీలయ్యాడట. అందుకే ఇకపై మీరు జంతువులను ఇంట్లకు తెస్తే మీరు బయటకు పోవాల్సి వస్తుందన్నాడట. అయినా ఆయన వార్నింగ్ ను స్వీట్ వార్నింగ్ గా భావించి మరిన్ని జంతువులను ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నారట.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *