Breaking News

వరుడు కావలెను మూవీ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే..?

యంగ్ హీరో నాగశౌర్య ఎప్పటికప్పుడు డిఫరెంట్ స్టోరీస్‌తో మూవీస్‌లో యాక్ట్ చేస్తూ మంచి ఇమేజ్ సొంతం చేసుకుంటున్నాడు. మొదటి నుంచి ఓకే అనిపించే మూవీస్ చేసినా.. ఛలో మూవీతో మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఆ మూవీ హిట్ అయింది కూడా. ఈ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రష్మిక సైతం ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ లిస్టులో చేరింది. ఇక రీతూ వర్మ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తెలుగులో చాలా మూవీస్‌లో యాక్ట్ చేసింది. ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్న మూవీస్ చేస్తూ ఆమె సైతం మంచి గుర్తింపు సంపాదించుకుంది. రీసెంట్‌గా నానీతో హీరోగా యాక్ట్ చేసిన టక్ జగదీష్ మూవీలో హీరోయిన్ గా నటించిన రీతూ తన యాక్టింగ్‌తో అందరినీ కట్టిపడేసింది.

తాజాగా నాగశౌర్య, రీతువర్మ కాంబినేషన్ లో వచ్చిన వరుడు కావలెను మూవీ శుక్రవారం రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. లక్ష్మీ సౌజన్య డైరెక్షన్‌‌లో వచ్చిన ఈ మూవీకి సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. చిన్న మూవీయే అయినప్పటికీ సినిమా ప్రమోషన్స్‌లో ఈ ఫిల్మ్‌మేకర్స్ కాంప్రమైజ్ కాలేదు. థియేట్రికల్ ట్రైలర్ మొదలు ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌ను సైతం భారీగానే ప్లాన్ చేశారు. మంచి ఫ్యామిలీ ఎంటటైనర్‌గా అందరినీ ఎంటలైన్ చేస్తుంది మూవీ.

ఇక స్టోరీ విషయానికి వస్తే.. ఎన్ఆర్ఐ ఆకాశ్ (హీరో) దుబాయ్‌లో ఆర్కిటెక్.. ఒక ప్రాజెక్టుపై ఇండియాకి వస్తాడు. ఈ టైంలో అదే కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న భూమి (హీరోయిన్)ను మీట్ అవుతాడు. ఇంప్రెస్ అయిన ఆకాశ్.. ఆమెనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. ఆ తర్వాత పెళ్లి చూపులకు వెళ్తాడు. కానీ పెళ్లి విషయంలో భూమి కాస్త బెట్టు చేస్తుంది. ఇంతలోనే అదిరిపోయే ట్విస్ట్ ఉంటుంది స్టోరీలో. తర్వాత ఆకాశ్, భూమి మధ్య దూరం పెరుగుతుంది. ఇందుకు ఏయే పాత్రలు వారికి హెల్ప్ చేస్తాయి. గతంలో జరిగిని విషయాలు వారి మధ్య దూరాన్ని ఎలా తగ్గిస్తాయి. తిరిగి వారు ఎలా కలుస్తారన్నదే స్టోరీ.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *