Breaking News

లేలేత అందాల చందమామ తల్లి కాబోతుందట కదా…

లేలేత అందాలు.. దోరని పెదాలు.. చందమామ లాంటి మోము.. ఒక్కమాటలో చెప్పాలంటే అందాల రాశి.. కాజల్ అగర్వాల్. తన సొగసుతో కుర్రకారును కట్టిపడేసిన కుందనపు బొమ్మ. దశాబ్దం పాటు తెలుగు సినిమా పరిశ్రమను ఏకచక్రాధిపత్యంగా ఏలిందీ సుందరి. తాజాగా ఈమె నటించిన ఆచార్య సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఈ అమ్మడు కొంత కాలం క్రితమే పెళ్లి చేసుకుంది. మూడు ముళ్లు పడ్డాక.. ఈ అమ్మడి అందం మరింత పదునెక్కింది. నాజూకు తనం పాలమీగడలా అద్దుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తొలుత గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. ఆ తర్వాత దాని నుంచి తప్పుకుందట. ఎందుకా అని పలువురు ఆరా తీశారు. అయితే ఈ నిర్ణయం వెనక ఓ స్వీట్ రీజన్ ఉందనే టాక్ నడుస్తోంది. ఇంతకీ అదేంటి అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

కాజల్ అగర్వాల్ ఇటీవల నాగార్జునతో ఓ సినిమాకు కమిట్ అయ్యింది. ఈ సినిమా నుంచి ఆమె అర్థాంతరంగా తప్పుకుంది. ఈ నేపథ్యంలో ఆమె గర్భవతి అయ్యిందనే ప్రచారం అయ్యింది. అందుకే ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లు టాక్. అయితే ఈ వార్తల్లో వాస్తవం ఎంత అనేది ఇప్పటికీ తెలియదు. అంతేకాదు.. తను తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటిలో కాస్త లావెక్కినట్లుగానే కనిపిస్తుంది. ఈ వార్తలు నిజం అనేందుకు ఇవే కారణం అనే చర్చ నడుస్తోంది.

అటు ఓ చిట్ చాట్ లో తన ప్రెగ్నెన్సీ గురించి ఓ విషయం చెప్పింది. మీరు తల్లికాబోతున్నారనే టాక్ నడుస్తుంది. దానిపై మీ రియాక్షన్ ఏంటి అనే ప్రశ్నలు వచ్చాయి. అయితే ఈ విషయం గురించి ఇప్పుడే మాట్లాడలేనని చెప్పింది. సమయం వచ్చినప్పుడు తానే చెపంతానని వెల్లడించింది. చాలా కాలంగా స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత కూడా పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం ఉన్నట్లు ఉండి సినిమా నుంచి తప్పుకోవడంతో తను ప్రెగ్నెంట్ అనే విషయం చాలా వరకు కన్ఫాం అనే సినిమా పరిశ్రమలో టాక్ వినిపిస్తుంది.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *