Breaking News

లారెన్స్ గురించి మీకు తెలియని కొన్ని నిజాలు.. ఆయనే లేకుంటే కారు క్లీనర్‌గానే ఉండేవాడట!

రాఘవ లారెన్స్.. ఈ పేరు వినగానే డాన్సింగ్ ప్రియులకు రోమాలు నిక్కపోడుచుకుంటాయి. రెప్పపాటులో ఎదుటి వాళ్లకు అర్థం కాకుండా స్టెప్పులు, మూమెంట్స్ చేయడం లారెన్స్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఇండియాలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరంటే అందరికీ మొదట గుర్తొచ్చేది ప్రభుదేవా మాస్టర్. కానీ. ఆయన శిష్యుడే మన రాఘవ లారెస్స్ అని చాలా మందికి తెలియదు.
ఇప్పుడు కనిపిస్తున్న రాఘవ లారెన్స్‌ ఆయన గురువు ప్రభుదేవా వలే మల్టీ టాలెంటెడ్. యాక్టర్‌, డైరెక్టర్‌, కొరియోగ్రాఫర్‌గా తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో అల్‌రౌండ‌ర్ ప్రదర్శన చేస్తున్నాడు.

లారెన్స్ సినిమాలే కాదు.. వారి అమ్మగారి పేరుమీద ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుంటాడు. ఒక చారిటీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనాథ పిల్లలకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి గుండె ఆపరేషన్లు వంటివి చేయిస్తూ సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఇలా తాను మంచి పొజిషన్‌లో ఉన్నానంటే దానికి ఒక్కరే కారణమని లారెన్స్ చాలా సార్లు చెప్పుకొచ్చాడు. ఆయనే లేకపోతే తాను ఇప్పటికీ కారు క్లీనర్‌గానే ఉండిపోయేవాడిని అని చెప్పుకుని భావోద్వేగానికి గురైన సందర్భాలు అనేకం ఉన్నాయట..

లారెన్స్ కొరియోగ్రాఫర్ కాకముందు సౌత్ ఇండస్ట్రీలో సూపర్ సుబ్బారాయన్ అనే ఫైట్ మాస్టర్ వద్ద కారు క్లీనర్‌గా పనిచేసేవాడట. సంగీతం వినిపిస్తే చాలు మెలికలు తిరుగుతూ డ్యాన్స్ చేసేవాడు. ఈ క్రమంలోనే ఓ రోజు సుబ్బరాయన్ వద్దకు సూపర్ స్టార్ రజినీ కాంత్ వచ్చాడు. ఆ టైంలో లారెన్స్ పనిచేస్తూ డ్యాన్స్ చేయడాన్ని గుర్తించిన తలైవా.. వెంటనే ప్రభుదేవా డ్యాన్స్ స్కూల్లో జాయిన్ చేయించాడట. అప్పుడు రజినీ ఆ నిర్ణయం తీసుకోకపోతే ఇప్పుడు లారెన్స్ లాంటి మంచి కొరియోగ్రాఫర్, యాక్టర్, దర్శకుడిని సౌత్ ఇండస్ట్రీ మిస్ అయ్యేది. లారెన్స్ టాలెంట్ చూశాకే చిరంజీవి కూడా ఠాగూర్ సినిమాలో కొరియోగ్రాఫర్‌గా చేయాలని పిలిచి మరీ అవకాశం ఇచ్చాడంటే.. మనోడి టాలెంట్ ఎంటో అర్థం చేసుకోవచ్చు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

3 comments

  1. Thanks for an explanation, the easier, the better …

  2. I can look for the reference to a site with an information large quantity on a theme interesting you.
    https://gay0day.com

  3. I am sorry, that has interfered… At me a similar situation. I invite to discussion. Write here or in PM.
    canadagayrealestateagent

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *