Breaking News

లవ్ స్టోరీ సినిమా సమంత చూసిందా..? ఏం చెప్పింది ?

అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరి’ సినిమా శుక్రవారం థియేటర్స్‌లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా స్లో పాయిజన్ లాగా హిట్ దిశగా సాగిపోతున్నది. ఇకపోతే కొద్ది రోజుల కిందట ఈ సినిమా ట్రైలర్ విడుదల అయినప్పుడు దానిని చూసి మూవీ యూనిట్‌కు సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెస్ చెప్పింది నాగచైతన్య వైఫ్ సామ్. కానీ, ఇప్పుడు చిత్రం విడుదల అయినా ఎటువంటి స్పందన లేదు. ఈ క్రమంలోనే ఇంతకీ సామ్ ‘లవ్ స్టోరి’ ఫిల్మ్ చూసిందా? లేదా? అని నెటిజన్లు, అక్కినేని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

గతంలో నాగచైతన్య నటించిన చిత్రాలు విడుదల అయినప్పుడు యాక్టివ్‌గా ఉండి చై సినిమాలను సపోర్ట్ చేసిన సామ్ ప్రజెంట్ ‘లవ్ స్టోరి’ విషయంలో కనీసం ఓ ట్వీటో లేదా ఇన్ స్టా వేదికగా ఓ పోస్ట్ చేయకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే చైతన్య, సమంత మధ్య గ్యాప్ ఉందని, త్వరలో వారు విడాకులు తీసుకోబోతున్నారనే చర్చ జరుగుతున్నది.

ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకుని బయటకు వస్తున్న క్రమంలో ఓ మీడియా సంస్థ ప్రతినిధి నాగచైతన్య, సామ్ మధ్య గ్యాప్ విషయం ప్రస్తావించగా సమంత అతడిపైన ఫైర్ అయింది. ఇకపోతే డైవోర్స్ విషయమై సోషల్ మీడియాలో ఇంత చర్చ జరుగుతున్నా నాగచైతన్య కాని, సమంత కాని, నాగార్జున కుటుంబ సభ్యులు కాని ఈ విషయమై స్పందించకపోవడం గమనార్హం. ఈ సంగతులు ఇలా ఉంచితే నాగచైతన్య మాత్రం ‘లవ్ స్టోరి’ ఫిల్మ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. మూవీ యూనిట్ సభ్యులు, ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరోయిన్ సాయిపల్లవితో కలిసి సెలబ్రేషన్స్‌లో చై పాల్గొన్నాడు. సినిమా మొదటి రోజు కలెక్షన్స్ కూడా బాగానే వచ్చినట్లు మేకర్స్ పేర్కొంటున్నారు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *