Breaking News

లవ్ స్టోరీ రివ్యూ : సాయి పల్లవి కి ఈ సారి గట్టి దెబ్బ తగిలినట్టేనా

కొవిడ్ మహమ్మారి ఎఫెక్ట్‌తో పెద్ద సినిమా విడుదల ఇంకా పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నాయి. థియేటర్స్‌లో చిత్రాలను ఇప్పుడప్పుడే విడుదల చేయాలంటే చాలు జంకుతున్నట్లు కనిపిస్తున్నది. ఇక కొన్ని సినిమాలు అయితే డైరెక్ట్ ఓటీటీల్లోనే రిలీజ్ అవుతున్నాయి. నాని ‘టక్ జగదీష్’, నితిన్ ‘మాస్ట్రో’ ఓటీటీల బాట పట్టాయి. ఈ క్రమంలో ధైర్యం చేసి శేఖర్ కమ్ముల డైరెక్షన్‌తో తెరకెక్కిన ‘లవ్ స్టోరి’ చిత్రాన్ని థియేటర్స్‌లో శుక్రవారం విడుదల చేశారు. అక్కినేని నాగచైతన్య ఈ చిత్రంలో హీరోగా నటించగా, ఆయన సరసన క్యూట్ సాయిపల్లవి హీరోయిన్‌గా నటించింది.

ఇకపోతే ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే, శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలా లేదనే చర్చ నడుస్తున్నది. జనరల్‌గా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రాలు అన్ని కూడా నేల విడిచి సాము చేసేవిలా ఉండబోవు. రొటీన్ ఫార్మాట్స్ లా కాకుండా వెరీ స్మూత్‌గా సాగిపోతూ ఉంటాయి. అశ్లీలతకు తావు లేకుండా కామెడీ ట్రాక్స్ అనేవి లేకుండా సందర్భోచితంగా సీన్లు ఉంటాయి. అయితే, ‘లవ్ స్టోరి’ చిత్రంలో మాత్రం కొంచెం ట్రాక్ మారిందని కొందరు చర్చిస్తున్నారు. అవే ఈ సినిమాకు మైనస్ అవుతాయని అభిప్రాయపడుతున్నారు.

అవేంటంటే.. సాధారణంగా శేఖర్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ ఇప్పటి వరకు సాఫీగా సాగిపోతూ వచ్చినవే. ‘లవ్ స్టోరి’కి ముందర వచ్చిన వరుణ్ తేజ్ ‘ఫిదా’ మూవీలో ఆహ్లాదకరమైన వాతావరణంలో సినిమా చక్కగా సాగిపోతుంటుంది. అయితే, ఈ చిత్రంలో మాత్రం పేదింటి అబ్బాయి, పెద్దింటి అమ్మాయి అనే అంశం, లైంగికత, కులం, కుల వివక్ష విషయాలపై చర్చ లేవనెత్తారు. ‘ఫిదా’లోని సాయిపల్లవికి ఈ సినిమాలోని సాయిపల్లవికి మధ్య సగటు ప్రేక్షకుడికి బోలెడంతం తేడా కనిపిస్తున్నది. ఇకపోతే శేఖర్ సినిమాలు అన్ని కూడా డైరెక్ట్‌గా థియేటర్స్‌లో రిలీజ్ అయిన తర్వాత మంచి టాక్‌ను సొంతం చేసుకుంటాయి. ప్రేక్షకుల చేత విశేషంగా ఆదరించబడతాయి.

అయితే, ‘లవ్ స్టోరి’ విషయంలో కాస్త డిఫరెంట్‌గా జరిగింది. రిలీజ్‌కు ముందరే భారీ హైప్ క్రియేట్ కాగా తీరా సినిమా చూడగా, సంక్లిష్టమైన అంశాలపై ఉండటం ద్వారా బహుశా అభిమానులు ఊహాలకు వ్యతిరేకంగా ఉంటాయని కొందరు అంటున్నారు. మొత్తంగా క్లీన్ స్టోరి కాకుండా ఈ సారి వెరీ డిఫరెంట్ స్టోరితో శేఖర్ సినిమా తెరకెక్కించారని సినీ పరిశీలకులు పేర్కొంటున్నారు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *